/rtv/media/media_files/2025/04/15/gf5nGyjZg3rFKab6r4uM.jpg)
marriage four
పెళ్లి అంటే వధూవరులు ఏడు జీవితాల పాటు కలిసి ఉండాలని ప్రమాణాలు చేసుకునే బంధం. అది సుఖమైనా, దుఃఖమైనా, భార్యాభర్తలు ప్రతి క్షణంలో ఒకరికొకరు తోడుగా ఉంటారు. కానీ కట్టుకున్న వాళ్లని మిమ్మల్ని మధ్యలో వదిలేస్తే ఇంతకంటే బాధాకరమైనది మరొకటి ఉండదు. బీహార్ కు చెందిన ఒక వ్యక్తి విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది.
బీహార్‌కు చెందిన బబ్లూ కుమార్ గుండె ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు బద్దలైంది. అతను అసలైన ప్రేమ దొరుకుతుందని -ఏకంగా మూడుసార్లు వివాహం చేసుకున్నాడు, కానీ అతని బ్యాడ్ లక్ కట్టుకున్న ముగ్గురు భార్యలు పెళ్లైన రెండు నెలల్లోనే అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
మేకప్ కిట్ తీసుకురమ్మని చెప్పి
బీహార్‌లోని జముయ్ జిల్లాలోని మలయ్‌పూర్ బస్తీలో నివసించే బబ్లూ కుమార్ శర్మ జీవితం సినిమా కథలా అనిపిస్తుంది. ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళిన బబ్లూ ఇప్పటివరకు మూడుసార్లు వివాహం చేసుకున్నాడు, కానీ ప్రతిసారీ అతనికి ద్రోహం, ఒంటరితనమే ఎదురయ్యాయి. మూడుసార్లు వివాహం చేసుకున్నప్పటికీ, అతని భార్యలు ఎవరూ అతనితో ఎక్కువ కాలం ఉండలేదు. అతని మూడవ భార్య అయితే పెళ్లైన ఒక రోజుకే తన ప్రియుడితో పారిపోయింది. 2023 డిసెంబర్ 2న మూడో పెళ్లి చేసుకున్న బబ్లూ భార్య మేకప్ కిట్ తీసుకురమ్మని చెప్పి అతను వచ్చేసరికి ప్రియుడితో పరార్ అయింది.
2022 ఏప్రిల్ లో బబ్లు మొదటిసారి వివాహం చేసుకున్నాడు. కానీ రెండు నెలల తర్వాత అతని భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత జూన్ 2023లో, ఈసారి అంతా బాగానే ఉంటుందని భావించి రెండో వివాహం చేసుకున్నాడు. కానీ కేవలం ఒకటిన్నర నెలల్లోనే అతని రెండవ భార్య కూడా అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. మూడో పెళ్లి చేసుకుంటే ఒక్కరోజుకే ఆమె ప్రియుడితో వెళ్లిపోయింది. అయిన బబ్లూ పట్టు వదలలేదు. ఇప్పుడు అతను తన నాల్గవ వివాహానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఒక రోజు తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరుకుతుందని ఆశిస్తున్నాడు.
Also read : Dil Raju: రేపు దిల్ రాజు బిగ్ అనౌన్స్మెంట్.. ఆ సినిమా గురించేనా..?