AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..మావోయిస్టుల కోసం ప్రత్యేక కోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం అమరావతి సచివాలయంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు వివిధ శాఖల మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది.