/rtv/media/media_files/2025/02/13/mn0KM8uykNq8cTrWC0VZ.webp)
Operation Kagar..
ఛత్తీస్ ఘడ్ అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. కొండగావ్..నారాయణ్ పుర్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. అక్కడ మావోయిస్టులను గుర్తించడంతో కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాలకు మధ్యనా ఎదురు కాల్పులు జరిగాయి. దీంతో మావోయిస్టులు పారిపోయారు. అయితే అందులో ఇద్దరినీ మాత్రం పోలీసులు మట్టుబెట్టారు.
Also Read : కేవలం రూ.1499కే ఏడాది కాలం వ్యాలిడిటీ
Also Read : రాకి రా.. సార్‌కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
ఇద్దరు అగ్రనేతలు..
ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలను, ఏకే 47 తుపాకీని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చనిపోయిన వారు అగ్రనేతలుగా గుర్తించారు. అయితే వారి పేర్లు ఇంకా ఏంటన్నది మాత్రం తెలియలేదు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఇంకా మావోయిస్టుల కోసం గాలింపు చేస్తున్నారు. దాదాపు ఈ రోజంతా గాలింపు కొనసాగుతుందని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజన్ తెలిపారు.
Also Read: USA-China: ట్రంప్ కు చైనా షాక్..బోయింగ్ విమానాలు బంద్
Also Read : భారీగా తగ్గిన బంగారం ధరలు.. కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం
today-latest-news-in-telugu | maoists | police | encounter | telugu-news | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | breaking news in telugu