AP: ఏపీలో కరవు మండలాల జాబితా విడుదల.. 5 జిల్లాల్లో 54 మండలాలు
ఏపీలో నైరుతి రుతుపవనాల సీజన్ లో ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏపీలో నైరుతి రుతుపవనాల సీజన్ లో ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ కారును అమాంతంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దాదాపు 6 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
వాయవ్య బంగాళాఖాతంలో దానా తీవ్ర తుపాన్ గా బలపడి హబాలికాతి నేచర్ క్యాంప్-ధమ్రాకు సమీపంలో తీరం దాటింది. రాబోయే మూడురోజుల్లో ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ఢీకొని ఐదుగురు మృతి చెందారు. బంధువు అంత్యక్రియలకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తున్నవారిని ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురంలో తెలంగాణ పోలీసుల కాల్పుల మోత కలకలం రేపింది. దొంగలను పట్టుకునే యత్నంలో ఫైరింగ్ చేయడంతో దొంగల ముఠా ద్విచక్ర వాహనాల్లో పరారయ్యారు. తెలంగాణలో చోరీలకు పాల్పడిన బిహార్ ముఠాగా పోలీసులు గుర్తించారు.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాళ్లను నమస్కరించి హోంమంత్రి వంగలపూడి అనిత ఆశీర్వాదం తీసుకున్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆశీర్వాదం తీసుకున్న వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది.
రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.
ఏపీలో సోమవారం మద్యం దుకాణాల లాటరీ ముగిసింది. లాటరీ వచ్చిన ఆనందంతో ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వ్యాపారి రంగనాథను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.