వారికి రూ.5లక్షలు.. చంద్రబాబు కీలక ప్రకటన!

AP: అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన చేశారు. జగన్ కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.

New Update
chandrababu

CM Chandrababu: అనంతపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన చేశారు. గార్లదిన్నె మండలం, కలగాసుపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చిన సీఎం....ఒక్కో మృతుని కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?

ఇది కూడా చూడండి:  కొడంగల్‌లో ఫార్మా కంపెనీ రద్దు.. సీఎం రేవంత్ సంచలనం!

మాజీ సీఎం జగన్ సంతాపం...

అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం తలగాసిపల్లె వద్ద ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మత్యువాత పడ్డారు, వీరంతా కూలీ పనులకు వెళ్ళొస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వారికి అవసరమైన సాయం అందజేయాలన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు