ఏపీలో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాద ఘటన అనంతపురంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడిక్కడే మరణించారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేశారు.

New Update
accident (1)1

ఏపీలోని అనంతపురంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గార్లదిన్నె మండలం తలగాసిపల్లె గ్రామానికి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆటో, బస్సు ఢీకొన్నాయి. వ్యవసాయి కూలీలతో వెళ్తున్న ఆటోను ఏపీఎస్‌ఆర్టీసీ  బస్సు ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటనలో మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

ఇది కూడా చూడండి: TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు!

ఇది కూడా చూడండి:  మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?

పని నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా..

కుట్లూరు మండలంలోని నెల్లుట్ల గ్రామానికి చెందిన 12 మంది వ్యవసాయ కూలీలు గార్లదిన్నెలో పని కోసం ఆటోలో వెళ్లారు. తిరిగి వస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి:  హాయ్ .. హలో అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే న్యూడ్ వీడియో!

ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో ఓ యువతిని సొంత కుటుంబ సభ్యులే నడిరోడ్డుపై కిడ్నాప్ చేశారు. కులాంతర వివాహం చేసుకున్నందున ఆమెను కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారు. ఆటోలో కూర్చున్న ఆ యువతని నడిరోడ్డుపై కొట్టి ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులతో పాటు మరో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, ఆ యువతిని రక్షించారు. 

ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు