BIG BREAKING: వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు!

AP: కదిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా పై కేసు నమోదైంది. నకిలీ ఇంటి పట్టాల తయారీ వ్యవహారంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2018లో  చాంద్ బాషా అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడే నకిలీ పట్టాలు తయారు చేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది.

New Update
YS Jagan : గెలుపే లక్ష్యం.. ఆ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించిన జగన్!

YCP Ex MLA: వైసీపీకి మరో షాక్ తగిలింది. కదిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా పై కేసు నమోదు అయింది. నకిలీ ఇంటి పట్టాల తయారీ వ్యవహారంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2018లో  చాంద్ బాషా అసైన్మెంట్ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడే నకిలీ పట్టాలు తయారు చేసినట్లు పోలీస్ విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.

Also Read: AP: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త!

14 రోజుల రిమాండ్...

Also Read: TG: మూసీ నిర్వాసితులకు హైకోర్ట్ బిగ్ షాక్..కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్

కాగా ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. చాంద్‌బాషా ప్రోత్సాహంతో నకిలీ పట్టాలు తయారు చేసినట్లు నిందితుడు అంగీకారం మేరకు మాజీ ఎమ్మెల్యే, గతంలో ఆర్‌.ఐ.గా పనిచేసిన మున్వర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ పట్టాలు తయారీ చేయడానికి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మున్వర్‌ రూ.20 లక్షలు లంచం డిమాండు చేశాడని.. ఆయన అడిగిన దానిలో రూ.11 లక్షలు ఇచ్చినట్లు సోమ్లానాయక్‌ పోలీసుల ఎదుట చెప్పాడు.

Also Read: Cinema: 47 ఏళ్లకు పెళ్లి చేసుకున్న నటుడు సుబ్బరాజు..వధువు ఎవరో తెలుసా?

ఈ క్రమంలో నకిలీ పట్టాల తయారీకి ప్రోత్సహించిన మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాష, ఆర్‌.ఐ.ని దోషులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి ఆయన వద్ద నుంచి 39 కిలీ పట్టాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి చెప్పారు. కోర్టు నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు చెప్పారు.

Also Read: Pawan: పిఠాపురంలో నాలుగు ప్రధాన రైళ్లు..రైల్వే మంత్రితో పవన్ భేటీ!

Advertisment
తాజా కథనాలు