Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు డాక్టర్లు స్పాట్ లోనే మృతి! అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విడపనకల్లు దగ్గర అదుపు తప్పిన కారు వేగంగా చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. By Archana 01 Dec 2024 in క్రైం అనంతపురం New Update Ananthapuram accident షేర్ చేయండి Anantapur District : ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. అతివేగం, నిర్లక్ష్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. తీవ్రమైన పొగమంచు వల్ల కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. Also Read: రూ. 295 కోసం ఏడేళ్ల పోరాటం..చివరికి ఏమైందంటే! ముగ్గురు డాక్టర్లు అక్కడిక్కడే మృతి అనంతపురం జిల్లా విడపనకల్లు వద్ద నలుగురు డాక్టర్లు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి వేగంగా చెట్టును ఢీకొంది. తీవ్రమైన మంచు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారులోని ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు నుజ్జు నుజ్జు కావడంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతులను యోగేష్, వెంకట్ నాయుడు, గోవిందరాజుగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే యోగేష్, వెంకట్ నాయుడు, గోవిందరాజు, అమరేష్ హాంకాంగ్ ట్రిప్ కి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో.. బెంగళూరు నుంచి బళ్లారి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? ఇలాంటి ఘటనే మరొకటి ఇది ఇలా ఉంటే..శనివారం అనంతపురం జిల్లా నార్పలలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద ఓ టైరు పగలడంతో అదుపుతప్పిన కారు.. అదే సమయంలో అటు వైపుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఇక ఆ కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం - కడప హైవేపై ఈ ప్రమాదం జరిగింది. కాగా మరణించిన వారంతా అనంతపురానికి చెందిన సంతోష్, షణ్ముక్, వెంకన్న, శ్రీధర్, ప్రసన్న, వెంకీగా గుర్తించారు. ఈ ఆరుగురు కలిసి తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. Also Read: BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు.. Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా #andhra-pradesh #anantapur #road-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి