కేసుల భయంతో దెబ్బకు దిగొచ్చిన RGV.. బాలయ్యపై ప్రశంసల వర్షం! ఆర్జీవిపై ఇటీవల ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు అయింది. ఈ నెల 19న స్టేషన్‌లో హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్జీవి, బాలయ్యపై ప్రశంసలు కురిపించాడు. డాకు మహారాజ్‌లో బాలయ్య ఇంత క్లాస్‌లీ పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. By Seetha Ram 17 Nov 2024 in సినిమా ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడుతుంటాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తుంటాడు. తనది కాని విషయంలో కూడా వేలు పెట్టి మరీ గెలికుంచుకుంటాడు ఆర్జీవి. దీంతో కాంట్రవర్సీ కింగ్‌లా మారిపోయాడు. ఆర్జీవీ అంటే వివాదం, వివాదం అంటే ఆర్జీవి అన్నట్లు సోషల్ మీడియాలో టాక్. ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ప్రత్యేకంగా 26 రైళ్లు ఏర్పాటు ఆర్జీవిపై కేసు నమోదు అలాంటి ఆర్జీవిపై ఇటీవల కేసు నమోదు కావడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవిపై కేసు నమోదు అయింది. తాను తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లలో ఆర్జీవి చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, బ్రాహ్మిణిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తాజాగా ఆర్జీవిపై కేసు నమోదు అయింది. ఇది కూడా చూడండి: ఉన్నత హోదా ఇప్పిస్తామని.. హీరోయిన్ తండ్రికి రూ.25 లక్షలు టోకరా వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు ఐటి చట్టం కింద ఆర్జీవిపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఆర్జీవికి హైదరాబాద్‌లో మద్దిపాడు పోలీసులు నోటీసులు అందించారు. ఈ నెల 19వ తేదీన స్టేషన్‌లో హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. అయితే ఈ కేసు విషయంపై ఆర్జీవి ఎక్కడా స్పందించలేదు. కానీ తాజాగా ఆయన పెట్టిన ఓ ట్వీట్ నెట్టింట అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన పార్టీ నాయకులపై ట్వీట్లతో విరుచుకుపడ్డ ఆర్జీవి ఇప్పుడు వారిపైనే ప్రశంసలు కురిపించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇది కూడా చూడండి: ట్రంప్ మరో విచిత్ర నిర్ణయం.. వ్యాక్సిన్లు వద్దన్న వ్యక్తికి హెల్త్ మినిస్ట్రీ! బాలయ్యపై ప్రశంసలు తాజాగా ఆయన టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. బాలకృష్ణ నటిస్తున్న ‘డాకు మహారాజ్’ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. ఆ టీజర్‌పై స్పందిస్తూ.. ‘‘ఈ టీజర్ హాలీవుడ్ రేంజ్‌లో కనిపిస్తోంది. ఇది కేవలం విజువల్స్ పరంగానే కాదు.. ఎమోషన్స్‌లో కూడా ఇతిహాసం ఉంది. బాలయ్య ఇంత క్లాస్‌లీ పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడని ఎప్పుడూ అనుకోలేదు.. ఈ సినిమా ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి వరకు నడుస్తుంది’’ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో చాలా మంది ఆశ్చర్యపోగా.. మరికొందరు మాత్రం కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. Hey @dirbobby this is looking HOLLYWOOD 🔥🔥🔥 ..It’s EPIC not in just VISUALS , but also in EMOTIONS🙏🏻🙏🏻🙏🏻 ..Never thought BALAYYA can look so CLASSILY POWERFUL … Looks like it will run from THIS SANKRANTHRI to NEXT SANKRANTHRI 💐💐💐https://t.co/06iJ1HhwqK via @YouTube — Ram Gopal Varma (@RGVzoomin) November 15, 2024 ఇది కూడా చూడండి: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రైవేట్ ఆసుపత్రికి రూ.30 లక్షల జరిమానా! ఆర్జీవిపై కేసు పెట్టినందుకే ఇప్పుడు ప్లేటు తిరగేశాడని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ కేసు పెట్టడంతో ఆర్జీవి వణికిపోతున్నాడని మరికొందరు అంటున్నారు. అందువల్లనే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆర్జీవి ఇప్పుడు అదే పార్టీలోని ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించడమేంటని అంటున్నారు. ఏది ఏమైనా ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. #ap-cm-chandrababu #daku maharaj #rgv #balakrishna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి