AP: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్..! ఏపీ ప్రభుత్వం ధాన్యం విక్రయాలను మరింత సులభతరం చేసేలా వాట్సాప్ సేవలను ప్రారంభించింది. పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వివరాలను తెలిపారు. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 18 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి AP Govt: రైతులకు ఏపీ ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. పండించిన ధాన్యం అమ్మకాలకు రైతులు ఇక ఇబ్బందులు పడాల్సిన పనిలేదు. ధాన్యం విక్రయాలను ఏపీ ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా తెలిపారు. రైతులు పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస పడాల్సిన అవసరం లేదన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. కేవలం వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలని అన్నారు. Also Read: High Court: భార్యను ఉద్యోగం మానేయమని బలవంతం చేయడం క్రూరత్వమే! 73373 59375 నంబరుకు వాట్సాప్ నుంచి హాయ్ అని చెబితే చాలు... సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి చెప్పారు. ఏ కేంద్రంలో, ఏ రోజు, ఏ సమయంలో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు అమ్మాలనుకుంటున్నారో ఆ వివరాలను వాట్సాప్ ద్వారా మెసేజ్ ఇస్తే స్లాట్ బుక్ అవుతుందని తెలిపారు. స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలనే దానిపై నాదెండ్ల మనోహర్ తన ఎక్స్ ఖాతా వేదికగా వీడియో షేర్ చేశారు. Also Read: OG Movie: ఇదేం ట్విస్ట్ సామీ..'OG' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అకీరా? అలాగే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా ప్రత్యేక వాయిస్‌తో ఈ సేవలు అందించనున్నట్లు సమాచారం. ఈ ప్రకారం ధాన్యం అమ్మాలనుకుంటున్న రైతు.. ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పెట్టాలి. ఆ తర్వాత ధాన్యం అమ్మడానికి షెడ్యూల్ చేసుకోవాలా అని ప్రశ్న వస్తుంది. దీనికి షెడ్యూల్ అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రైతు తన ఆధార్ నంబర్ నమోదు చేయాలి.ఆ రైతు తన పేరును ధృవీకరించాల్సి ఉంటుంది. Also Read: Hyderabad: యాసిడ్‌తో అల్లం పేస్ట్...ప్రముఖ హోటళ్లకు ఇదే సరఫరా! ఈ ధ్రువీకరణ పూర్తైన తర్వాత ఎక్కడ అమ్మాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంచుకోవాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంచుకున్న తర్వాత రైతుకు మూడు తేదీలను ఆప్షనల్‌గా ఇస్తారు. ఆప్షన్లుగా ఇచ్చిన మూడు తేదీలలో ధాన్యం అమ్మాల్సిన తేదీని రైతు ఎంచుకోవాలి. ఆ తర్వాత ఏ సమయానికి అమ్మాలనుకుంటున్నారనే దానిపైనా మూడు ఆప్షన్లు అధికారులు ఇస్తారు. సమయాన్ని కూడా రైతు ఎంచుకున్న తర్వాత ఎలాంటి రకం ధాన్యం అమ్మాలనుకుంటున్నారనే దానిపై ఓ ఆప్షన్ ఉంటుంది. Also Read: Andhra Pradesh: ఉన్నత పాఠశాలల సమయం గంట పెంపు! ధాన్యం రకాన్ని కూడా రైతు ఎంచుకున్న తర్వాత.. ఎన్ని బస్తాలు అమ్మాలనుకుంటున్నారనే వివరాలను అడుగుతారు. ఇది కూడా ఎంచుకున్న తర్వాత ధాన్యం అమ్మకం షెడ్యూల్ పూర్తైనట్లు రైతుకు కూపన్ కోడ్‌తో ఓ మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్‌ను సెల్‌ఫోన్‌కు కూడా పంపుతారు. ఈ మొత్తం ప్రక్రియను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుగు వాయిస్‌తో వినిపిస్తూ ఉంటారు. #farmers #andhrapradesh #Whatsapp Number #nadendla-manohar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి