AP crime: మేనమామ కాదు కాలయముడు..ఆస్తి కోసం దారుణం శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండల మరువపల్లిలో ఆస్తి తగాదాలు, కుటుంబ విభేదాలే కారణంగా 13 ఏళ్ల బాలుడి ప్రాణాలు తీశారు. చేతన్‌ను వాళ్ల మేనమామ అశోక్ కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 30 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update AP crime షేర్ చేయండి AP crime: ఈ మధ్య మనుషులు మృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ విభేదాలే కారణంగా 13 ఏళ్ల బాలుడి ప్రాణాలు తీసేలా చేసింది. బడి నుంచి కిడ్నాప్ చేసి గొంతు కోసి బాలుడి దారుణ హత్య చేశాడు ఓ మేనమామ. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో కలకలం రేపుతోంది. మడకశిర మండల పరిధిలోని ఆమిదాలగొంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చేతన్ అనే బాలుడు చదువుతున్నాడు. పాఠశాల నుంచి చేతన్‌ను కిడ్నాప్ చేశారు. ఈ రోజు పావగడ మండలం రాజవంతి సమీపంలోని అటవీ ప్రాంతంలో విగతజీవిగా పడి ఉన్నాడు. డబ్బు కోసం.. వెంకటేశ్వర్లు-పుష్పలత దంపతులు విభేదాల కారణంగా పన్నెండేళ్ల క్రితం విడిపోయారు. విడాకుల అనంతరం కుమారుడు చేతన్‌తో కలిసి పుష్పలత మరువపల్లికి గ్రామంలోని పుట్టింట్లో ఉంటోంది. చేతన్ 3 కిలోమీటర్ల దూరంలోని ఆమిదాలగొంది జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. వెంకటేశ్వర్లు రెండో వివాహం చేసుకున్నాడు. పుష్పలత కియ పరిశ్రమలో ఉద్యోగం చేస్తూ కుమారుడిని పోషిస్తూ జీవనం కొనసాగిస్తుంది. చేతన్ తాత శ్రీరామప్పకు ఫోన్ చేసి నీ మనవడిని కిడ్నాప్ చేశామని చెప్పారు. బడిలో ఉన్నాడో లేదో కంగారుపడిన పాఠశాలకు వెళ్లి ఆరా తీశాడు. గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై తీసుకువెళ్లారని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు చేతన్‌ను వాళ్ల మేనమామ తీసుకెళ్లాడని విద్యార్థులు చెప్పారు. Also Read: వెల్లుల్లి తింటే పురుషులకు అద్భుత ప్రయోజనాలు పుష్పలత తల్లి గంగమ్మకు ఓ సోదరి కొడుకే అశోక్. పుష్పలతకు తమ్ముడుగా చేతన్‌కు మేనమామ వరుస అవుతాడు. పుట్టింట్లో ఉన్న పుష్పలతకు భర్త నుంచి భరణం రూపంలో మూడు ఎకరాల పొలం వచ్చింది. నెలకు రూ.3 వేలు ఇస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా పుష్పలతకు మరికొన్ని ఆస్తులున్నాయన్న విషయంలో కుటుంబంలో విభేదాలు వస్తున్నాయి. భర్తకు దూరమైన పుష్పలతకు చేతన్ వారసుడు. చేతన్‌ను తప్పిస్తే ఆస్తి దక్కుతుందని భావించి అశోక్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఫోన్‌కాల్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ నంబర్ ఓ మహిళదని గుర్తించారు. దీంతో అశోక్‌ను అనుమానించి పోలీసులు మహిలను అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. తన ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేశారని అశోక్‌ని ఆ మహిళ గుర్తించింది. దీంతో చేతన్‌ను హత్య చేసింది అశోక్ అని పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. Also Read: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు అక్కడిక్కడే మృతి! #ap-crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి