/rtv/media/media_files/2025/05/25/oJ2Weqsn67Ph6wLqUQnn.jpg)
దేశరాజధాని ఢిల్లీలో రెండుమూడు రోజులుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివానకు దేశ రాజధాని అతలాకుతలం అవుతోంది. గాలిదుమారం, పిడుగులులతో కూడిన వర్షానికి ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. వర్షం దాటికి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ దెబ్బతిన్నది. విమానశ్రయంలో టెర్మినల్ కూలిపోయింది. పలువురికి గాయాలైయ్యాయి. అక్కడే పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం తెల్లవారుజామున టెర్మినల్ 1 టెంట్ చినిగిపోయింది. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Vikas overflows in Delhi Airport after a drizzle. pic.twitter.com/BP7bA5QaGV
— Congress Kerala (@INCKerala) May 25, 2025
భారత వాతావరణ శాఖ ప్రకారం, ఢిల్లీలో శనివారం రాత్రి 11:30 గంటల నుంచి ఆదివారం ఉదయం 5:30 గంటల మధ్య ఆరు గంటల వ్యవధిలో గంటకు 82 కి.మీ వేగంతో గాలులు వీచాయని, 81.2 మి.మీ వర్షపాతం నమోదైంది. అంతర్జాతీయ విమానాలు సహా మొత్తం 49 విమానాలను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దారి మళ్లించారు. విద్యుత్ సరఫరా అంతరాయం, ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఢిల్లీ అంతటా తీవ్ర నష్టం వాటిల్లింది. గతంలో కూడా భారీ వర్షాల కారణంగా ఎయిర్‌పోర్ట్‌లో టర్మినల్ కూలిపోయింది.
delhi-airport | Terminal collapses | heavy-rain | heavy rain fall