Viral Video : తండ్రి శవం ముందు లవర్కు తాళి కట్టాడు.. వీడియో వైరల్ !

తండ్రి మృతదేహం ఎదుట కుమారుడు పెళ్లి చేసుకున్న సంఘటన తమిళనాడులోని కడలూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. అంతిమయాత్రకు ముందే ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ప్రియురాలిని ఒప్పించి తండ్రి మృతదేహం ఎదుట ఆమెకు తాళి కట్టారు.

author-image
By Krishna
New Update
marriage father dead body

marriage father dead body

ఏ తండ్రికైనా తన కళ్లముందు కొడుకు పెళ్లి జరగాలని, మనవడు,మనవరాళ్లతో ఆడుకోవాలని కోరికగా ఉంటుంది. కానీ ఆ కోరిక తీరకముందే ఓ తండ్రి అనంతలోకాలకు వెళ్లిపోయాడు.  దీంతో ఆ కొడుక్కితీరని వేదన మిగిల్చింది.  దీంతో అంత్యక్రియలకు ముందే తన తండ్రి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో తన ప్రియురాలిని ఒప్పించి తండ్రి మృతదేహం ముందు ఆమెకు తాళి కట్టి ఆశీస్సులు తీసుకున్నాడు. అక్కడికి వచ్చిన బంధువులు, స్థానికులు వారిని పుట్టెడు దుఃఖంలోనూ ఆశీర్వదించారు. ఈ ఘటన తమిళనాడులోని కడలూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.  

Also read :  Hyderabad: నగరంలో భారీ వర్షం.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ!

Also read : Urvashi Rautela: నటి ఊర్వశీపై చర్యలు తీసుకోవాలి.. తీవ్ర స్థాయిలో ఫైరవుతున్న అర్చకులు

విజయశాంతితో ప్రేమలో

విరుధాచలం సమీప కవణై గ్రామానికి చెందిన సెల్వరాజ్‌(63) రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. లాయర్ చదువుతున్న ఆయన రెండో కుమారుడు అప్పు.. విరుధాచలం కౌంజియప్పర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మూడో సంవత్సరం విద్యార్థిని విజయశాంతితో ప్రేమలో పడ్డాడు. గత 4 సంవత్సరాలుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో అప్పు తండ్రి సెల్వరాజ్‌ అనారోగ్యంతో బుధవారం రాత్రి చనిపోయారు. దీంతో తన తండ్రి ఆశీస్సులు పొందాలని తన ప్రియురాలును ఒప్పించి ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. అయితే దీనికిఅమ్మాయి తరఫువారు హాజరుకాలేదు. అనంతరం సెల్వరాజ్ మృతదేహాన్ని స్థానిక శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన వృద్ధాచలం ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది,  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

Also read :  Char Dham Yatra: మే 2నకేదార్‌నాథ్ ,4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్!

Also Read :  Marriage: 60ఏళ్ల వయసులో BJP రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పెళ్లి.. ఆమె మరెవరో కాదు!

 

telugu-news | tamil-nadu | father | latest-telugu-news | today-news-in-telugu | viral news telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు