Char Dham Yatra: మే 2న కేదార్‌నాథ్ - 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్!

చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మే 2న అధికారికంగా తిరిగి తెరుచుకుంటాయని శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బికెటిసి) ప్రతినిధి తెలిపారు. అలాగే మే 04వ తేదీన బద్రీనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేస్తామన్నారు.  

New Update
Kedarnath dham

Kedarnath dham

చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మే 2న అధికారికంగా తిరిగి తెరుచుకుంటాయని శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బికెటిసి) ప్రతినిధి తెలిపారు. అలాగే మే 04వ తేదీన బద్రీనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేస్తామన్నారు.  వీటితో పాటుగా రెండో కేదార్ గా పిలువబడే మద్మహేశ్వర్ ఆలయ తలుపులను మే 21వ తేదీన, మూడో కేదార్ తుంగ గుడిని మే  02 తెరుస్తామని వెల్లడించారు.

Also read :  Char Dham Yatra: మే 2నకేదార్‌నాథ్ ,4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్!

Also Read :  Marriage: 60ఏళ్ల వయసులో BJP రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పెళ్లి.. ఆమె మరెవరో కాదు!

ప్రతి శివ భక్తుడు తన జీవితంలో

విపరీతమైన మంచు వలన కొన్ని రోజుల పాటే ఈ ఆలయాలు తెరుచుకుని ఉంటాయి. ప్రతి శివ భక్తుడు తన జీవితంలో ఒక్కసారైనా  కేదార్‌నాథ్‌ను సందర్శించాలని కోరుకుంటాడు. ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర 2025 ఏప్రిల్ 30 నుంచి మొదలుకానుంది. ఈ యాత్రలో గంగోత్రి, యమునోత్రి ద్వారాలు ఏప్రిల్ 30న తెరుచుకోనున్నాయి. 

చార్ ధామ్ యాత్ర అత్యంత ముఖ్యమైన హిందూ తీర్థయాత్రలలో ఒకటి. ఈ తీర్థయాత్ర యమునోత్రి నుండి ప్రారంభమై, గంగోత్రికి, తరువాత కేదార్‌నాథ్‌కు వెళ్లి చివరకు బద్రీనాథ్‌లో ముగుస్తుంది.  ఈ ప్రయాణాన్ని రోడ్డు లేదా వాయు మార్గం ద్వారా చేయవచ్చు, హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొంతమంది భక్తులు దో ధామ్ యాత్రను చేపడతారు. కేదార్‌నాథ్ ఆలయం శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అలాగే, పంచ కేదార్ తీర్థయాత్రలలో కేదార్‌నాథ్ ఆలయం మొదటిది. 

Also read :  Hyderabad: నగరంలో భారీ వర్షం.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ!

Also read : Urvashi Rautela: నటి ఊర్వశీపై చర్యలు తీసుకోవాలి.. తీవ్ర స్థాయిలో ఫైరవుతున్న అర్చకులు

 

telugu-news | char-dham-yatra | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు