Marriage: 60ఏళ్ల వయసులో BJP రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పెళ్లి.. ఆమె మరెవరో కాదు!

బెంగాల్ మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తన 60వ యేట పెళ్లి చేసుకున్నాడు. బీజేపీ మహిళా నాయకురాలు రింకు మజుందార్‌ను శుక్రవారం బెంగాల్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇది రెండో పెళ్లి కాగా.. దిలీప్ ఘోష్‌ ఇప్పటి వరకు బ్రహ్మచారి.

New Update
dilip Ghosh marriage

బీజేపీ నాయకుడు 60ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా బీజేపీ పార్టీ నాయకురాలినే. దిలీప్ ఘోష్ పశ్చిమ బెంగాల్ బిజెపి మాజీ అధ్యక్షుడు. ఆయన శుక్రవారం పార్టీ రింకు మజుందార్‌ అనే మహిళా బీజేపీ నాయకురాలిని వివాహం చేసుకున్నారు. ఇది ఆయన మొదటి పెళ్లి కావడం విశేషం. దిలీప్ ఘోష్ బ్రహ్మచారిగా ఉన్నాడు. అలాగే రింకు మజుందార్‌కు ఇది రెండో పెళ్లి. ఆమెకు 51 సంవత్సరాలు. ఇది వరకే పెళ్లై ఓ కుమారుడు ఉన్నాడు. బెంగాలీ సంప్రదాయంలో వీరి పెళ్లి కోల్‌కతా న్యూ టౌన్‌లోని నివాసంలో జరిగింది. పెళ్లికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ దిలీప్ ఘోష్  కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ బీజేపీ నాయకులు, టీఎంసీ లీడర్లు కూడా ఆ పెళ్లికి హాజరైయ్యారు. ఆయన వ్యక్తిగత జీవితం రాజకీయ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపదని వివాహం అనంతరం మీడియాతో అన్నారు.

Also read: ISS: ఇంటర్నేషన్ స్పేస్ సెంటర్‌కు మొదటిసారిగా ఇండియన్ ఆస్ట్రోనాట్.. ఎవరో తెలుసా?

అమ్మ కోరిక మేరకే పెళ్లి

తన తల్లి కోరికను తీర్చడానికి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నానని దిలీప్ ఘోష్ అన్నారు. దిలీప్ ఘోష్ తన చిన్నప్పటి నుండి ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడిగా ఉన్నాడు. 2015లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష పార్టీ స్థానంలో బిజెపిని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తీసుకురావడంలో ఆయన ఘనత ఉంది.

Also read: 28 హాస్పిటల్స్ సీజ్.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

దిలీప్ ఘోష్ 2021లో ఎకో పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా రింకు మజుందార్‌‌ను ఫస్ట్ టైం కలిశారు. కాలక్రమేణా ఈ సంబంధం పెరిగిందని వారికి సన్నిహితులు తెలిపారు. ఈ తనను పెళ్లి చేసుకోమని రింకు మజుందారే దిలీప్ ఘోష్‌ను అడిగిందట. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ సహా సీనియర్ బిజెపి నాయకులు రోజంతా ఘోష్ నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘోష్ కు పూల బొకేలు, శుభాకాంక్షలు చెప్తూ ఓ లేఖను పంపారు. 

(Dilip Ghosh Marries | Former West Bengal BJP president | west bengal news | bjp-leader | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు