/rtv/media/media_files/2025/05/26/wbAftIYW5uGBqDMcIwUq.jpg)
Sugar Test
సాధారణంగా మధుమేహ బాధితుల్లో షుగర్ లెవల్స్‌ను గుర్తించాలంటే రక్తం తీసి గ్లూకోమీటర్‌తో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇకనుంచి అలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం శ్వాసతోనే షుగర్ లెవల్స్‌ను గుర్తించే పరికరాన్ని మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో ఉన్న త్రివేది ప్రభుత్వ అధ్యాపకులు, విద్యార్థులు రూపొందించారు. మనిషికి సూది గుచ్చకుండా, రక్తం తీయకుండానే షుగర్ స్థాయిని గుర్తించే పరికరం ఇది.
Also Read: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)
Also Read : పాకిస్థాన్‌పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
Diabetes Test With Breath
ఇందులో మన శ్వాసను ఊదాలి. దాన్ని విశ్లేషించాక, కొన్ని సెకన్లలోనే చక్కెర స్థాయిని ఇది తెలియజేస్తుంది. ఇది కచ్చితమైన షుగర్ స్థాయిని చెప్పనప్పటికీ రూడింగ్‌ను మూడు విధాలుగా చూపిస్తుంది. లో అంటే శరీరంలో చక్కెర స్థాయి తక్కువగా ఉందని.. మోడరేట్ అంటే సాధారణంగా ఉందని.. ఒకవేళ హై అని చూపిస్తే ఎక్కువగా ఉందని అర్థం.
Also Read: ప్రభుత్వం కీలక నిర్ణయం.. తాజ్ మహల్ వద్ద యాంటీ డ్రోన్ సిస్టం
దీనిపై ప్రొఫెసర్ దుర్గేశ్ మాట్లాడారు. '' 2017లో ఈ ప్రాజెక్టును ప్రారంభించాం. షుగర్ రోగుల్లో కీటోజెనిక్ జీవక్రియ ప్రారంభమై వాళ్ల శరీరం లోపల కీటోన్లు వస్తాయి. ఆ సమయంలో అందులో ఉండే అసిటోన్ వాళ్ల శ్వాసలోకి వస్తుంది. అలాంటి పరిస్థితిలో అసిటోన్, గ్లూకోజ్ మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశాం. వాటి నిష్పత్తి స్పష్టం చేసేందుకు కోడింగ్ చేశాం. తర్వాత రెండింటిని మధ్య సంబంధాన్ని ఏర్పరిచేందుకు ప్రొగ్రామింగ్ చేశాం. ఆ తర్వాత ఇంజనీరింగ్ సాయంతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యిందని'' దుర్గేశ్ అన్నారు.
Also Read : హైదరాబాద్ తో పాటు ఆ 7 ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర
rtv-news | telugu-news | latest-telugu-news | today-news-in-telugu | healthy life style | daily-life-style | human-life-style | madhya pradesh news | diabetis