/rtv/media/media_files/2025/05/25/9BqHgfmwT7pGmCHmzSVI.jpg)
Taj mahal
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌లోని జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లో డ్రోన్లు, మిసైల్స్‌తో పాక్ దాడులకు యత్నించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆ దాడులను తిప్పికొట్టింది. అయితే తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తాజ్‌మహల్ వద్ద మరింత భద్రతను పెంచనుంది. అక్కడి పరిసర ప్రాంతాల్లో యాంటీడ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
తాజ్‌మహల్ వద్ద ప్రస్తుతం CISF, యూపీ పోలీసులు భద్రత కల్పి్స్తున్నారు. అక్కడ డ్రోన్ దాడులను కూడా తిప్పికొట్టేందుకు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీనికి 78 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుందని తెలిపారు. తాజ్‌మహల్ ప్రధాన డోమ్‌కు 200 మీటర్ల వరకు పరిసరాలను రక్షించేలా ఈ రక్షణ వ్యవస్థ ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే
తాజ్‌మహల్‌కు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్‌డీఎక్స్‌తో తాజ్‌మహల్‌ను పేల్చేస్తామని కేరళ నుంచి అధికారులకు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజ్‌మహాల్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు, బాంబు నిర్వీర్యం దళం, డాగ్ స్క్వాడ్, భారత పురావస్తు సర్వే (ASI) అధికారులు, CISF భద్రతా దళం మూడు గంటల పాటు తాజ్‌మహల్ ప్రాంగణంలో తనిఖీలు చేశారు. కానీ అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టిదిట్టం చేశారు.
ఉత్తరప్రదేశ్ టూరిజం శాఖకు, ఢిల్లీ పోలీసులకు గుర్తు తెలియని మెయిల్ ఐడీ నుంచి తాజ్‌మహల్‌కు బెదిరింపు సందేశం వచ్చింది. ఆర్‌డీఎక్స్ బాంబుతో తాజ్‌మహల్‌ను పేల్చేస్తామని అందులో హెచ్చరించారు. రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు. చివరికి ఇది ఫేక్ ఈమెయిల్ అని తేలింది. సైబర్ సెల్ పోలీస్ స్టేషన్‌లో కూడా దీనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
telugu-news | rtv-news | taj-mahal