/rtv/media/media_files/2025/05/26/74SVbL1nsASX9luTbDWJ.jpg)
Conspiracy for blasts in Hyderabad and other 7 areas, Know Details
బాంబు పేలుళ్ల కుట్రకు సంబంధించిన కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. కస్టడీలో ఉన్న సిరాజ్, సమీర్ మూడో రోజైన ఆదివారం పోలీసులకు కీలక విషయాలు వెల్లడించారు. వీళ్లిద్దరికీ వివిధ కోణాల్లో విచారణ సాగినట్లు తెలుస్తోంది. గత 6 నెలలుగా హైదరాబాద్‌లోనే సమీర్‌తో పాటు విజయనగరం వాసి సిరాజ్ ఉంటున్నాడు. వీళ్లిద్దరూ అక్కడే బాంబు పేలుళ్లకు పన్నాగం పన్నినట్లు పోలీసులు విచారణలో తేలినట్లు తెలుస్తోంది.
Also Read: నీ అక్రమ సంబంధం సీక్రెట్ నీ భార్యకు చెబుతా.. ఇంజనీర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన AI!
Conspiracy For Blasts In Hyderabad
దేశవ్యాప్తంగా ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, చెన్నై, విజయనగరంతో పాటు ఏడు చోట్ల బాంబులు అమర్చి విధ్వంసం సృష్టించేందుకు పథకం పన్నినట్లు పోలీసులు విచారణలో తేలింది. సౌదీ, ఒమాన్ దేశాల్లో ఉన్న ఉగ్ర ముఠాలతో ఈ ఇద్దరు సంబంధాలు పెట్టుకున్నట్లు బయటపడింది. వరంగల్, హైదరాబాద్, ఢిల్లీలో ఉన్న ఫర్హన్, బాదర్, రహీంలతో బాంబు పేలుళ్ల గురించి అలీం అనే పేరుతో వాట్సాప్ గ్రూప్‌లో చాటింగ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)
సిరాజ్, సమీర్ ముస్లిమేతరులనే లక్ష్యంగా చేసుకోని సోషల్ మీడియలా పేలుళ్లకు కుట్ర పన్నిన్నట్లు విచారణలో తేలింది. మరోవైపు వరంగల్ ఫర్హన్, ఢిల్లీ బాద్ నుంచి ఈ ఇద్దరికి ఉన్న సంబంధాలను రాబట్టేందుకు విజయనగరం పోలీసులు రంగంలోకి దిగారు. స్థానిక పీటీసీలో ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. మళ్లీ సాయంత్రం 5.30 గంటలకు మొదలైన విచారణ రాత్రి వరకు జరిగింది.
Also Read: నీ అక్రమ సంబంధం సీక్రెట్ నీ భార్యకు చెబుతా.. ఇంజనీర్‌ను బ్లాక్ మెయిల్ చేసిన AI!
Also Read : సరస్వతి పుష్కరాలు చివరిరోజు.. కొనసాగుతున్న భక్తుల రద్దీ
telugu-news | rtv-news | bomb-blast