Rahul Gandhi: ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ
ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరారు.
ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరారు.
దేశీయ మార్కెట్లో సూచీలు మంచి ఊపు మీదున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాలున్నప్పటికీ దేశీ స్టాక్స్ రాణిస్తున్నాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,500 పైన ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగి 24,400 స్థాయిలో ఉంది.
కెనడాలో లిబరల్ పార్టీ దూసుకుపోతోంది. మార్క్ కార్నీ నేతృత్వంలో ఆ పార్టీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. దీంతో ఆయనే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కన్జర్వేటివ్ పార్టీ కూడా గట్టి పోటీనే ఇస్తోంది.
ఐక్యరాజ్యపమితిలో పాకిస్తాన్ భారత్ మరోసారి తిట్టిపోసింది. అదొక రోగ్ దేశమంటూ ధ్వజమెత్తింది. ఉగ్రవాదాన్ని తామే పెంచి పోషించామని ఆ దేశ రక్షణ మంత్రే స్వయంగా ఒప్పకున్నారంటూ భారత రాయబారి తీవ్రంగా విమర్శించారు.
పహల్గామ్ దాడి తరువాత ఐదు పెద్ద నిర్ణయాలతో పాక్ ను తేరుకోలేని దెబ్బ కొట్టింది భారత్. ఇది ఎంత గట్టిగా తగిలింది అంటే దెబ్బకు పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఆసుపత్రిలో చేరారని సమాచారం. ఆయన అనారోగ్యం పాలయ్యారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వస్తున్నాయి.
ఇండియన్ క్రికెట్ లో మరో సంచలనం పుట్టుకొచ్చింది. అతి పిన్న వయసులో రికార్డుల మోత మోగిస్తోంది. ఐపీఎల్ లో వెలుగు చూసిన ఈ అద్భుతం పేరే వైభవ్ సూర్య వంశీ. నిన్నటి మ్యాచ్ లో 35 బంతుల్లో 100 చేసి గుజరాత్ బౌలర్లను ఊచ కోత కోశాడు వైభవ్.
ఐపీఎల్ లో ఈరోజు ఢిల్లీ, బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఢిల్లీ ఇచ్చిన 162 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.3 ఓవర్లలో ఛేదించింది.
టెంపరరీ వీసాలతో భారత్ కు వచ్చిన పాక్ పౌరులకు భారత ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ రోజు తో ముగిసింది. దీంతో ఇప్పటి వరకు 537 మంది అట్టారీ-వాఘా సరిహద్దు మార్గంలో పాకిస్థాన్‌కు వెళ్ళారని తెలుస్తోంది. వీరిలో తొమ్మది మంది దౌత్య వేత్తలు, అధికారులు ఉన్నారు.
ఎల్కతుర్తి సభలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ మాట్లాడిన మాటలపై మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. అధికారం పోయిన అక్కసులో కేసీఆర్ నోటికొచ్చింది మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మీ కూతురు పెద్ద కార్లలో తిరుగుతుంటే మా బిడ్డల్లో బస్సుల్లో కూడా తిరక్కూడదాని ప్రశ్నించారు.