India VS Bangladesh:  బంగ్లాదేశ్ పై అద్భుత విజయం...ఫైనల్ లోకి టీమ్ ఇండియా

మాకు తిరుగులేదని మరోసారి నిరూపించింది టీమ్ ఇండియా. ఆసియా కప్ లో ఈరోజు సూపర్-4 మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ కు దూసుకెళ్ళింది. టీమ్ ఇండియా 41 పరుగుల తేడాతో గెలిచింది.

New Update
team india new jersey for asia cup 2025 revealed

team india new jersey for asia cup 2025 revealed

తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళుతోంది టీమ్ ఇండియా. ముఖ్యంగా టీ20ల్లో తమను ఎవరూ గెలువలేరు అని మరోసారి నిరూపించింది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఈరోజు దుబాయ్ స్టేడియంలో బంగ్లాదేశ్, భారత్ మధ్య సూపర్ -4 మ్యాచ్ జరిగింది. ఇందులో టీమ్ ఇండియా అన్ని రకాలుగా ఆధిపత్యం చలాయించింది. బ్యటింగ్, బౌలింగ్ లో సంయక్తంగా రాణించి..అద్భుత విజయాన్ని దక్కించుకుంది. భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు విలవిలలాడారు.  ఆ జట్టులో హసన్ ఒక్కడే 69 పరుగులతో హై స్కోరర్ గా నిలిచాడు. అయితే మరో ఎండ్ లో వికెట్లు టపాటపా పడిపోవడంతో భారత్ గెలుపును ఆపలేకపోయారు. దీంతో టీమ్ ఇండియా 41 పరుగుల తేడాతో గెలిచింది. భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా..తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులో ఓపెనర్‌ సైఫ్‌ హసన్‌ (69: 51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు.భారత బౌలర్లలో కుల్‌దీప్‌ 3, వరుణ్‌ చక్రవర్తి 2, బుమ్రా 2, అక్షర్‌ పటేల్‌, తిలక్‌ వర్మ ఒక్కో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్ విజయంతో టీమ్ ఇండియా ఫైనల్ లోకి దూసుకెళ్ళగా...సూపర్ -4లో రెండు మ్యాచ్ లు ఓడిన శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. రేపు పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ లో విజేతగా నిలిచే జట్టు సెప్టెంబరు 28 ఫైనల్ లో భారత్ తో తలపడుతుంది. శుక్రవారం భారత్, శ్రీలంకల మధ్య సూపర్-4 నామమాత్రపు మ్యాచ్ జరగనుంది. 
 
 

ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లు
 
 

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 12 ఓవర్ లో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ మంచి శుభారంబాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి 77 పరుగులు జోడించారు. ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టారు. 77 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శుభ్ మన్ గిల్ (29) పరుగులకు ఔటయ్యాడు. కానీ అభిషేక్ శర్మ మాత్రం బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 
ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. ఈ క్రమంలోనే  25 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ (75) పరుగుల వద్ద రనౌటయ్యాడు.  స్ట్రైకింగ్ లో ఉన్న సూర్య సింగిల్ కోసం ముందుకు వచ్చి తర్వాత వెనక్కి తగ్గాడు.అప్పటికే సగం దూరం వచ్చిన అభిషేక్ మళ్లీ నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు పరుగెత్తి రనౌటయ్యాడు. అభిషేక్ మరికొద్దిసేపు క్రీజులో ఉంటే స్కోరు బోర్డు ఇంకా వేగంగా వెళ్లేది.  అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు,5 సిక్సులున్నాయి. 

Advertisment
తాజా కథనాలు