J&K: మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు
ఉగ్రవాదులను వెతికి పట్టుకోవడానికి బారత బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మరో ఉగ్రవాది ఇల్లును పేల్చేశారు. ఫరూఖ్ అహ్మద్ తెడ్వా అనే ఎల్ఈటీ ఇంటిని కాల్చేశారు.
ఉగ్రవాదులను వెతికి పట్టుకోవడానికి బారత బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మరో ఉగ్రవాది ఇల్లును పేల్చేశారు. ఫరూఖ్ అహ్మద్ తెడ్వా అనే ఎల్ఈటీ ఇంటిని కాల్చేశారు.
ఐపీఎల్ సీజన్ 18లో చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు ఇంటికి వెళ్ళిపోయినట్లే. హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన సీఎస్కే ప్లే ఆఫ్స్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. దీనిపై కెప్టెన్ తలా ధోనీనే నిస్సహాయత వ్యక్తం చేశాడు. ఎవరూ ఆడకపోతే తానేం చేయాలి అంటూ బాధను వెళ్ళగక్కారు.
ప్రస్తుతం భారతదేశం చాలా సున్నితంగా ఉంది. పహల్గామ్ దాడి అందరిలోనూ ఉద్రేకాన్ని రేపింది. దీని కారణంగా కొంతమంది హద్దుమీరి చర్యలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో కొంతమంది ఉగ్రదాడి ప్రతీకారం అంటూ ఒక అమాయకుడి ప్రాణాలు తీశారు.
పహల్గామ్ దాడి జరిగిన తరువాత భారత్, పాకిస్తాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.దీంతో రక్షణకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మీడియా, సోషల్ మీడియాలకు సూచించింది.
ఐపీఎల్ లో ఈసీజన్ లో మొట్టమొదటి ఓక మ్యాచ్ వర్షానికి అర్పణమైంది. నిన్న ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. పంజాబ్ బ్యాటింగ్ చేసింది..తరువాత లక్ష్య ఛేదనలో కోలకత్తా కేవలం ఒక ఓవర్ మాత్రమే ఆడింది.
భారత్ ఇచ్చిన షాక్ కు పాకిస్తాన్ విలవిలలాడుతోంది. అసలే ఆర్థికంగా చితికిపోయి ఉన్న దాయాది పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారిపోయింది. దెబ్బకు పాక్ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. మరోవైపు భారత స్టాక్ మార్కెట్లో కూడా సూచీలు భారీ నష్టాలు చూస్తున్నాయి.
పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం ఉందని ఆరోపిస్తోంది ఇజ్రాయెల్. హమాస్ అగ్రనేతలు పాకిస్తాన్ లో ఉన్నరని...లష్కరే తోయిబాతో కలిసి పని చేస్తున్నారని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ధృవీకరించారు.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరో నాలుగు నుంచి వారం రోజుల్లో యుద్ధం జరిగేలానే కనిపిస్తోందని అన్నారు పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ . భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసి తప్పు చేసిందని ఆయన అన్నారు.
ఏం జరిగినా...ఎవరేం అన్నా తమ నోటిని మాత్రం కంట్రోల్ లో పెట్టుకోమంటున్నారు పాక్ నేతలు. ఒకవైపు యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాన్ని మరింత ఎగదోస్తూ.. పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు స్వాత్రంత్య సమరయోధులంటూ పాక్ ఉప ప్రధాని వ్యాఖ్యలు చేశారు.