/rtv/media/media_files/2025/02/14/modi-trump-wishing.jpg)
గత కొన్ని నెలలుగా భారత్, అమెరికా(india-us-relations) మధ్య సంబంధాలు వీక్ అయ్యాయి. అదనపు సుంకాలు కారణంగా ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పలుచన అయ్యాయి. దీని కారణంగా వాణిజ్య చర్చలు ఆగిపోయాయి. అయితే కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump)... భారత్ తమకు చాలా ముఖ్యమైనదని...మోదీతో తనకు మంచి మిత్రుడని ప్రకటించారు. దీనికి భారత ప్రధాని మోదీ కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో ఇరు దేశాల మధ్య ున్న స్తంభన కరిగింది. వాణిజ్య చర్చలకు అమెరికా పచ్చజెండా ఊపింది. అమెరికా అధికారులు త్వరలో భారత్ కు రానున్నారు.
Also Read : సొంత పౌరులపై పాక్ బాంబులు.. మరో 13 మందిని చంపి.. ఏం చేసిందంటే?
ఈ ఏడాది చివర్లో...
ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ(PM Modi) తో చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని యూఎస్ విదేశాంగ శాఖ అధికారి ఒకరు తెలిపారు. త్వరలో ఇరుదేశాధినేతలూకలుస్తారని చెబుతున్నారు. అమెరికాకు భారత్ తో దౌత్య సంబంధాలు చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మోదీ , ట్రంప్కలుస్తారని అధికారి చెప్పారు. దాంతో పాటూ తదుపరి క్వాడ్ లీడర్స్ సమ్మిట్ కు తేదీని నిర్ణయించడానికి కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. నేతలు ఇద్దరి మధ్యా సానుకూల సంబంధం ఉందని విదేశాంగ శాఖ అధికారి చెప్పారు.
కాశ్మీర్ సమస్యతో సంబంధం లేదు..
అలాగే రష్యా(Russia) నుంచి చమురు కొనుగోలుపై భారత్, అమెరికాల ధమ్య చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారురాబోయే కొద్ది వారాల్లోనే ఇవి ఒక కొలిక్కి వస్తాయని చెప్పారు. ఇక కాశ్మీర్ సమస్యలపై అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకోరని అధికారి తెలిపారు. అది భారత్ పాకిస్తాన్ ల సమస్యని...దానిని వారే పరిష్కరించుకుంటారని చెప్పారు. అయితే ట్రంప్ ను అడిగితే సాయం చేయడానికి తప్పకుండా ముందుంటారని అన్నారు.
అంతకు ముందు అదనపు సుంకాలు... దాని తరువాత హెచ్ 1బీ వీసా ఫీజు పెంపు(H1B Visa Fee Hike) ఉద్రిక్తత నడుమ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తమకు చాలా ముఖ్యమని.. ఆదేశం ముఖ్యమైన భాగస్వామని అన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ సందర్భంగా జైశంకర్, రూబియో లోట్టే న్యూయార్క్ ప్యాలెస్ లో సమావేశం అయ్యారు. యూఎన్జీఏలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తో సమావేశమయ్యానని చెప్పారు. వాణిజ్యం, రక్షణ, ఔషధాలు వంటి కీలకమైన అంశాలపై చర్చలు జరిపామని తెలిపారు. ఈ సందర్భంగా భారత్ తమకు ఎంతో కీలకమని అన్నారు. క్వాడ్ తో సహా ఇండో- పసిఫిక్ ప్రాంతాలను ప్రోత్సహించేందుకు కలిసి పనిచేసేందుకు రూబియో, జైశంకర్ లు అంగీకరించారని అమెరికా ప్రకటించింది.
Also Read: Trump Fire On UN: కావాలని కుట్ర చేశారు..యూఎన్ చేదు అనుభవాలపై దర్యాప్తుకు ఆదేశించిన ట్రంప్