Trump Fire On UN: కావాలని కుట్ర చేశారు..యూఎన్ చేదు అనుభవాలపై దర్యాప్తుకు ఆదేశించిన ట్రంప్

నిన్న జరిగిన యూఎస్ సర్వసభ్య సమావేశంలో మూడుసార్లు అమెరికా అధ్యక్షుడు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. దీనిపై ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. అవన్నీ యాదృచ్చికంగా జరిగినవి కాదని..కావాలనే కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు. చేదు ఘటనలపై దర్యాప్తుకు ఆదేశించారు.

New Update
triple

An elevator at the United Nations stopped right as US President Donald Trump and First Lady Melania Trump got on it.

నిన్న నూయార్క్(new-york) లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో 150 దేశాలు పాల్గొన్నాయి. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న ప్రసంగించారు. దాదాపు 56 నిమిషాల పాటూ ఆయన మాట్లాడారు. అయితే యూఎన్(UN)

సమావేశ సమయంలో ట్రంప్ కు వరుసగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సభలో ఆయన మాట్లాడుతుండగా టెలిప్రాంప్టర్‌ పనిచేయని సంగతి తెలిసిందే. అంతకుముందు సమావేశానికి వస్తుండగా ట్రంప్‌ ఎక్కిన ఎస్కలేటర్‌ కూడా ఆగిపోయింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాలకు హాజరయ్యేందుకు అమెరికా ప్రథమ మహిళ, భార్య మెలానియాతో కలిసి ట్రంప్ (Donald Trump) హాజరయ్యారు. సమావేశానికి సంబంధించిన వేదిక వద్దకు వెళ్లేందుకు వీరిద్దరూ అక్కడి ఎస్కలేటర్‌ ఎక్కారు. అయితే, ఏం జరిగిందో తెలియదు గానీ.. వారిద్దరూ ఎక్కిన వెంటనే ఎస్కలేటర్‌ పనిచేయకుండా ఆగిపోయింది. అప్పటివరకు బాగపనిచేసిన ఎస్కలేటర్‌ ట్రంప్‌, మెలానియా దంపతులు ఒకింత అయోమయానికి గురయ్యారు. ఆ తర్వాత ఆగిన ఎస్కలేటర్‌పై మెట్లు సమావేశానికి ఎక్కి వెళ్లిపోయారు.

Also Read :  సొంత పౌరులపై పాక్ బాంబులు.. మరో 13 మందిని చంపి.. ఏం చేసిందంటే?

దర్యాప్తుకు సీక్రెట్ సర్వీసెస్ కు ఆదేశం..

ఆ తరువాత ట్రంప్(Donald Trump) ప్రసంగించడానికి వచ్చినప్పుడు టెలీప్రాంప్టర్(Tele Prompter) పని చేయలేదు. దీంతో ఆయన కొద్దిసేపు తన స్వంతంగానే మాట్లాడారు. అలాగే మాట్లాడుతున్నప్పుడు సౌండ్ సిస్టమ్ కూడా సరిగ్గా పని చేయలేదు. దీని కారణంగా ట్రంప్ మాట్లాడింది చాలా మందికి వినిపించలేదు. ప్రసంగం అయ్యాక తన భార్య మెలానియా తనకు ఏమీ వినిపించలేదని చెప్పిందని ఆయన చెప్పారు. ఈ ముూడు చేదు అనుభవాలపై అమెరికా అధ్యక్షుడు సీరియస్ గా ఉన్నారు. కావాలనే తనపై ఎవరో కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై దర్యాప్తు జరగాల్సిందే అంటూ పట్టుపట్టారు. అంతేకాదు మూడు సంఘటనలపై దర్యాప్తు చేయాలని సీక్రెట్ సర్వీసెస్ కు ఆదేశాలు కూడా జారీ చేశారు.

ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్...

యూఎస్ సమావేశంలో తనకు ఎదురైనవి మూడూ అత్యంత దుర్మార్గపు సంఘటనలని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి కేవలం సాంకేతిక వైఫల్యాలే కావు...ప్రమాదకరమైనవి కూడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎస్కలేటర్ విషయంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఎస్కలేటర్ హఠాత్తుగా ఆగిపోయింది. మెలానియా, తాను ఉక్కు మెట్ల మీద పడిపోయేవాళ్ళమే..కానీ గట్టిగా పట్టుకోవడం వలన ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పుకొచ్చారు. దీనిపై తాను ఓ లేఖ రాస్తానని...దానిని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి పంపుతానని చెప్పారు. అలాగే అన్ని సంఘటనల మీద సమగ్ర దర్యాప్తు జరగాల్సిందేనని అన్నారు. ముఖ్యంగా ఎస్కలేటర్ కు సంబంధించి అన్ని ఫుటేజీలనుభద్రపరచాలని ఆదేశించారు. దీనిపై వైట్ హౌస్ కూడా దర్యాప్తుకు ఆదేశించింది. ఇది ఏదో సడెన్ గా జరిగింది కాదని..కావాలని చేసిన దానిలా ఉందని ఆరోపించింది.

Also Read: BIG BREAKING:  పాకిస్తాన్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ

Advertisment
తాజా కథనాలు