Stock Market: వరుస పతనం తర్వాత కోలుకున్న మార్కెట్..ఫ్లాట్ గా సూచీలు

వరుసగా మూడు రోజులు పాటూ నష్గాలను చవిచూసిన భారత స్టాక్ మార్కెట్ ఈరోజు మళ్ళీ లాబాల పట్టాలెక్కింది. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా తగ్గి 81,600 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 30 పాయింట్లు తగ్గి 25,050 వద్ద ట్రేడవుతోంది.

New Update
business

Stock Market Today

వారంలో నాలుగో రోజు అయిన గురువారం స్టాక్ మార్కెట్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతోంది. వరుస నష్టాల నుంచి కోలుకుంటోంది. బీఎస్ఈ 30 షేర్లు కోలుకుంటున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా తగ్గి 81,600 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 30 పాయింట్లు తగ్గి 25,050 వద్ద ట్రేడవుతోంది. అయితే ఆటో రంగం మాత్రం ఇంకా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. టాటా మోటార్స్ షేర్లు దాదాపు 2శాతం పడిపోయాయి.

ఇంకా ఒత్తిడిలోనే మార్కెట్లు..

సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 20 నష్టపోగా.. 10 స్టాక్ లు లాభాలను ఆర్జించాయి. ఆటో, ఐటీ ,బ్యాంకింగ్ స్టాక్‌లు ఈరోజు అత్యధికంగా నష్టపోయాయి. FMCG , ఇంధన స్టాక్‌లు లాభపడ్డాయి. HDFC బ్యాంక్ - 1.5%, SBI - 1.2%, ఇన్ఫోసిస్ - 0.9%, ఆసియన్ పెయింట్స్ - 0.8% లాబాల్లో ఉన్నాయి. మరోవైపు టాటా మోటార్స్ - 2.0%, హీరో మోటోకార్ప్ - 1.4%, విప్రో - 1.1%, బజాజ్ ఆటో - 0.9% నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే భారత స్టాక్ మార్కెట్లో ఒత్తిడి మాత్రం ఇంకా పోలేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. హెచ్ 1బీ ఫీజుల పెంపు ప్రభావం ఇంకా మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపిస్తోందని చెబుతున్నారు. విదేశీ పెట్టుబడిదారులు నిరంతరం అమ్మకాలను చేస్తున్నారని అందుకే మార్కెట్ క్షీణిస్తోందని చెబుతున్నారు. అయితే బారత్ లో ప్రవేశపెట్టిన ార్థిక సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను, కార్పొరేట్ రంగాన్ని బలోపేతం చేస్తాయని...దాని ఫలితంగా సమీప భవిష్యత్తులో విదేశీ పెట్టుబడిదారులు తిరిగి వస్తారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎంత తొందరలో జరుగుతుందో చెప్పడం కష్టమని చెప్పారు.

ప్రపంచ మార్కెట్లలో మిశ్రమ ట్రేడింగ్

ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 0.20% పెరిగి 45,719 వద్ద ట్రేడవుతుండగా, కొరియా కోస్పి 3,471 వద్ద ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.32% పెరిగి 26,603 వద్ద, చైనాకు చెందిన షాంఘైకాంపోజిట్ 0.15% పెరిగి 3,859 వద్ద ట్రేడవుతున్నాయి. అలాగే సెప్టెంబర్ 24న US డౌ జోన్స్ 0.37% తగ్గి 46,121 వద్ద ముగిసింది. నాస్‌డాక్కాంపోజిట్ 0.33% , S&P 500 0.28% పడిపోయాయి.

Also Read: Modi-Trump: త్వరలో ట్రంప్, మోదీ మీటింగ్...అమెరికా అధికారుల సంకేతాలు

Advertisment
తాజా కథనాలు