Russia-USA: రష్యా పేపర్ టైగర్ కాదు..ట్రంప్ కౌంటరిచ్చిన పుతిన్ ప్రభుత్వం

మూడేళ్ళుగా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని..పేపర్ టైగర్ లా అయిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై రష్యా స్పందిస్తూ..మాస్కో బేర్ అని పేపర్ బేర్ గా ఉండదని రిప్లై ఇచ్చింది.

New Update
kremlin

Kremlin spokesperson Dmitry Peskov

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) కు రష్యా(Russia) కొరకరాని కొయ్యలా తయారయ్యింది. ఎంత ప్రయత్నిస్తున్నా..ఆయన మాట వినడం లేదు. ఉక్రెయిన్ యుద్ధం మానడం లేదు. ట్రంప్ చాలా రకాలుగా ప్రయత్నించి చూశారు కానీ...ప్రతీసారి విఫలమే అయ్యారు. అయినా సరే అమెరికా అధ్యక్షుడు ట్రై చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు రష్యాను ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. తాజాగా ఉక్రెయిన్ తో చాలా కాలంగా యుద్ధం చేస్తూ రష్యా ఆర్థికంగా చితికిపోయిందంటూట్రంప్ వ్యాఖ్యలు చేశారు. పైకి గంభీరంగా కనిపిస్తున్నా...పేపర్ పులి మాదిరి మారిందని అన్నారు. యుద్ధం వల్ల రష్యాకు భారీగా ఖర్చవుతోందని, చమురు విక్రయంతో నిధులు సమకూర్చుకోవడం మాస్కోకు కష్టంగా మారిందన్నారు.

Also Read :  అమెరికాలో మళ్ళీ కాల్పులు...ఈ సారి డాలస్ పురంలో..

పేపర్ బేర్ మనుగడలో లేదు..

ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా ధీటుగా బదులిచ్చింది. మాస్కో(Mascow) ఎప్పటికీ పేపర్ బేర్, పులి అవ్వదని...అది ఎప్పుడూ ఒరిజినల్ బేర్అని సమాధానం చెప్పింది. రష్యా పులి కాదు...బేర్ తో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుంది. పేపర్ బేర్ అనేది మనుగడలో లేదు. కాబట్టి రష్యా గురించి ఎవరూ చింతించక్కర్లేదని మాస్కో చెప్పింది. తాము ఆర్థికంగా బలంగా ఉన్నామని తెలిపింది. ఉక్రెయిన్ లో తమ బలగాలు పై చేయి సాధిస్తున్నారని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రిపెస్కోవ్‌ తెలిపారు. తమ సైన్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని..వ్యూహాలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని చెప్పారు. ఎన్ని రోజులు యుద్ధం సాగినా.. నష్టపోకుండా ఉండేందుకు అత్యంత జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని పెస్కోవ్ తెలిపారు.

Also Read :  UNHRCలో పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఒకేఒక్కడు.. ఇండియా స్ట్రాంగ్ కౌంటర్

Advertisment
తాజా కథనాలు