Ladakh Protest: కాశ్మీర్ లో జెన్ జెడ్ నిరసనలకు కారణం ఏంటి? ఎందుకు వాళ్ళకు సడెన్ గా అంత కోపం వచ్చింది?

జమ్మూ-కాశ్మీర్ మరో నేపాల్ అవుతుందా. ప్రస్తుత పరిస్థితి చూస్తే అదే అనిపిస్తోంది. లడఖ్ రాజధాని లేహ్ లో నిరసనకారులు రెచ్చిపోయారు. ఆందోళనలతో అట్టుడికిపోయింది. దీనికి కారణం ఏంటి? లడఖ్ మరో నేపాల్ లా తయారవుతుందా?

New Update
ladakh

లడఖ్‌ రాజధాని లేహ్‌(leh-ladhak) లోనిరసనకారులు రెచ్చిపోయారు. ఇక్కడి బీజేపీకార్యలాయానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు ఇవ్వాలని నిరసనకారులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పలు మార్లు చర్చలు, నిరసనలు జరిగాయి. కానీ ఇటీవల జరిగిన నిరసనలలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కోపంతో ఉన్న నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు, అధికారులపై రాళ్లు రువ్వారు. అంతేకాకుండా పోలీసు వాహనాన్ని కూడా తగలబెట్టారు, రాష్ట్ర సాధన ఉద్యమంలో జరిగిన హింస ఇది.. ఇందులో నలుగురు మరణించగా...మరో ౭౦ మంది గాయపడ్డారు.

Also Read :  పట్టపగలు నడిరోడ్డుపై దోపిడీ.. దేశ రాజధానిలో రూ.కోటి నగలు చోరీ

చాలారోజుల నుంచి నిరసనలు..

అసలు లేహ్ లో గొడవ ఇప్పుడు మొదలైంది కాదు. ఇక్కడ ప్రజలు శాంతియుతంగా చాలా రోజుల నుంచి నిరసన తెలుపుతూ ఉన్నారు. నిరాహార దీక్షలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం హింసకు పాల్పడ్డారు. శాంతియుత నిరసనలకు నాయకత్వం వహిస్తున్న కార్యకర్త సోమన్ వాంగ్చుక్ దీని జెన్ జీ విప్లవం కింద అభివర్ణించారు. ప్రస్తుతం లేహ్ లో కర్ఫ్యూ విధించారు. మరింత అశాంతి చెలరేగకుండా నిరోధించడానికి సున్నితమైన ప్రాంతాలలో అదనపు భద్రతా దళాలను మోహరించారు. అసలు ఈ గొడవ అంతా నిరాహార దీక్ష చేస్తున్న 15 మంది ఆరోగ్యం క్షీణించడంతో మొదలైందని చెబుతున్నారు.

2019లో ఆర్టికల్ 370 రద్దు మరియు జమ్మూ కాశ్మీర్ విభజన తర్వాత లడఖ్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా విభజించారు . అయితే జమ్మూ, కాశ్మీర్ మాదిరి దీనికి శాసన సభ మాత్రం లేదు. ఋ ప్రాంతాన్ని ప్రత్యక్ష కేంద్ర పాలనలో ఉంచారు. దీనిపై అక్కడి ప్రజలు సంతృప్తిగా లేరు. నే నిరసనల రూపంలో తెలుపుతూ ఉన్నారు. వాతావరణ కార్యకర్త సోనమ్వాంగ్‌చుక్ నేతృత్వంలోని ఒక బృందం సెప్టెంబర్ 10 నుండి నిరాహార దీక్ష చేస్తోంది. లడఖ్‌ను ఆరవ షెడ్యూల్‌లో చేర్చడంతోపాటు రాష్ట్ర హోదా కోసం కేంద్రంతో చర్చలు జరపాలని వారు కోరుతున్నారు. కార్యకర్త వాంగ్చుక్ చెప్పినదాని ప్రకారం గత ఐదేళ్ళుగాలేహ్ లడక్ యువత నిరుద్యోగులుగా ఉన్నారు. ఇది సామాజిక ఆశాంతికి దారి తీసిందని ఆయన చెప్పారు. అయితే తాను హింసకు వ్యతిరేకిని ఆయన చెబుతున్నారు. లేహ్ యువత తమ డిమాండ్లను శాంతియుత మార్గాల ద్వారా సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

బుధవారం జరిగిన ఆందోళనలకు లేహ్అపెక్స్ బాడీ నాయకత్వం వహించింది. ఇది పలు మత, సామాజిక, రాజకీయ సమూహాల సమ్మేళనం అని చెబుతున్నారు. కార్యకర్త వాంగ్చుక్ కూడా ఇందులో సభ్యులే. ఇతను కొన్ని రోజులుగా నిరసనలను చేస్తున్నారు. దాని ద్వారా తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. నిన్న జరిగిన నిరసనల్లో కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ కూడా పాల్గొంది. ఇది ఎల్ఏబీకి తన మద్దతు తెలిపింది. రెండు సంస్థలు గత నాలుగు సంవత్సరాలుగా సంయుక్తంగా ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నాయి. వారి డిమాండ్లను ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వంతో అనేక రౌండ్ల చర్చలు నిర్వహిస్తున్నాయి.

Also Read :  ఇంటిదొంగ.. ఉగ్రవాదులకు సహయం చేసిన దేశద్రోహి అరెస్ట్

ఇందులోకి కాంగ్రెస్ ను ఎందుకు లాగారు?

బిజెపి(bjp) నాయకుడు అమిత్ మాల్వియాలేహ్‌లో జరిగిన హింసకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసి, కాంగ్రెస్‌ను దానికి లింక్ చేశారు. లడఖ్ లో అల్లర్లు చేస్తున్న వారిలో లేహ్వార్డ్ కాంగ్రెస్ కౌన్సిలర్ ఫుంట్సోగ్స్టాన్జిన్త్సెపాగ్ ఉన్నారని ఆయన ఆరోపించారు. అసలు జనసమూహాన్నిబీజేపీ కార్యాలయం మీదకు రెచ్చగొట్టింది కాంగ్రెస్ నాయకుడే అని చెప్పారు. దీనికి సంబంధించి ఫోటోలు, వీడియో ఆయన ఎక్స్ లో పోస్ట్ కూడా చేశారు. రాహుల్ గాంధీ ఊహించుకుంటున్న శాంతి ఇదేనా అంటూ అమిత్ మాల్వియా ప్రశ్నించారు. అసలు రాహుల్ గాంధీనే యువతను గొట్టడానికి ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఎన్నికల అవకతవకల గురించి, ప్రజాస్వామ్యం గురించి ప్రశ్నించాలంటూ యువతను ఆయనే రెచ్చగొట్టారని ఆరోపించింది. 

Advertisment
తాజా కథనాలు