/rtv/media/media_files/2025/09/24/og-2025-09-24-23-20-07.jpg)
సుజీత్ దర్శకత్వంలో ఓజీ మూవీ దుమ్ములేపడం ఖాయం అని అంటున్నారు. తెలంగాణలో పడిన ఓజీ ప్రివ్యూలపై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఈజ్ బ్యాక్ అని చెబుతున్నారు. ఈ సినిమాలో పవన్ ఇరగదీశారని రివ్యూలు వస్తున్నాయి. హరిహరవీర మల్లుతో నిరాశపర్చిన పవన్ ఓజీతో మాత్రం ఫ్యాన్స్ మంచి ట్రీట్ ఇచ్చారని చెబుతున్నారు. పవన్ కెరీర్ లో మరో హిట్ మూవీ పడిందని అంటున్నారు. ప్రీమియర్ షో పడకుముందు నుంచే సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్ సినిమా చూసొచ్చాక మరింత ఆనందంలో మునిగిపోయారు. ఇన్నాళ్ళకు తమ పవర్ స్టార్ కమ్ బ్యాక్ ఇచ్చారని చెబుతున్నారు. సుజీత్...పవన్ కల్యాణ్ ను ఓ రేంజ్ లో చూపించాడని రివ్యూలు ఇస్తున్నారు. సాహోతోనే అందరినీ ఆకట్టుకున్న సుజీత్...ఓజీని మరింత మెచ్చూర్డ్ గా తీశాడని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ ను సనైన రీతిలో చూపించాడని...ఆయనకు ఇలాంటి సినిమాలే పడాలని చెబుతున్నారు.
మొత్తం పవన్ షో..
ఓజీలో పవన్ కల్యాణ్ నటన, స్టైల్, సుజీత్ టేకింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని రివ్యూలు వస్తున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో తమన్ అయితే ఇరగదీశాడని కామెంట్ చేస్తున్నారు. సినిమా ఇంకా పూర్తవ్వకుండానే పాజిటివ్ రివ్యూలతో ట్విట్టర్ ను నింపేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయమని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావడంతో అభిమానులు కోరుకునే విధంగా హీరోని సుజీత్ ప్రజెంట్ చేశారని చెబుతున్నారు.
ఓజీ' కథ జపాన్ లో మొదలు అవుతుంది. అక్కడ ఓ జపనీస్ గురువు ప్రియ శిష్యుడు ఓజాస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఓజాస్ చిన్నతనంలో ముంబై వస్తాడు. ఇతనిని ఎవరు తీసుకు వచ్చారు? ఏ పరిస్థితుల్లో వచ్చాడు? అనేది సినిమాలో చూడాలి. ముంబై వచ్చిన ఓజాస్ గంభీర ఏం చేశాడు? ఓమీతో అతను ఎటువంటి యుద్ధం చేశాడు? అనేది సినిమా. గ్యాంగ్ స్టర్ గొడవలు, మాఫియా కార్యకలాపాలకు దూరంగా భార్య కన్మణితో ఓజాస్ గంభీర ఎటువంటి జీవితం గడిపాడు? భార్యకు తెలియకుండా అతను ఏం చేశాడు? ఒంటి చేత్తో మాఫియాను ఎదిరించి ప్రజలకు ఎటువంటి మేలు చేశాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
మొత్తంగా ఈ సినిమా పవన్ కల్యాణ్ పవర్ ప్యాక్డ్ షో అని చెబుతున్నారు. హీరోయిన్ల పాత్రలు చాలా తక్కువగా ఉన్నాయని...ఫ్యామిలీలకు అంతగా నచ్చకపోవచ్చని చెబుతున్నారు. కానీ యాక్షన్ లవర్స్ కు మాత్రం ఓజీ సినిమా మంచి కిక్ ఇస్తుందని రివ్యూలు ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ ను చాలా స్టైలిష్ గా దర్శకుడు సుజీత్ చూపించాడని చెబుతున్నారు. అలాగే ఓజీ సినిమాలో పవన్ పాడిన జపనీస్ హైకూ కూడా హైలెట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. తమన్ మ్యాజిక్ అదరగొట్టాడని..పవన్ కు తగ్గట్టుగా..యాక్షన్ సన్నివేశాల్లో ఎలివేషన్ సాగిందని చెబుతున్నారు. మొత్తానికి ఓజీ సినిమాపై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.