UN Meeting:నీ మాటలు ఎవడు వింటాడు..ఐరాసలో నెతన్యాహు స్పీచ్ కు అవమానం
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అనుకోని సంఘటన ఎదురైంది. ఆయన మాట్లాడుతుండగా..మిగతా దేశాలకు చెందిన ప్రతినిధులు అక్కడి నుంచి వాకౌట్ చేశారు.
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అనుకోని సంఘటన ఎదురైంది. ఆయన మాట్లాడుతుండగా..మిగతా దేశాలకు చెందిన ప్రతినిధులు అక్కడి నుంచి వాకౌట్ చేశారు.
అసలే కష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రంప్ ప్రకటించిన పార్మీ టారిఫ్ లదెబ్బతో మరింత అట్టడుగుకి వెళ్ళిపోయాయి. ఈ రోజు ప్రారంభం నుంచి దేశీ సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ అవుతున్నాయి.
హెచ్ 1 బీ వీసా ఫీజును లక్ష డాలర్్లకు పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం పై ఆయనకు గట్టి దెబ్బే తగలనుందని తెలుస్తోంది. దీనిపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమైందని సమాచారం.
ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్, ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ లు సమావేశం అయ్యారు. అయితే ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నా ఆయన కోసం వారు చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అసలేం జరిగింది? ఎందుకు ట్రంప్ పాక్ ప్రధానిని అవమానించారు?
హెచ్1 బీ వీసా ఫీజుల పెంపుపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఐరాస వేదికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవికత నుంచి ఎవరూ పారిపోలేరని..ప్రపంచ శ్రామిక శక్తిని ఎవరూ ఆపలేరంటూ పరోక్షంగా ట్రంప్ ను విమర్శించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ నంబర్ వన్ బిలయనీర్ ఎలాన్ మస్క్ లు మళ్ళీ ఒక్కటయ్యారు. ట్రంప్ ప్రభుత్వంతో మస్క్ మరోసారి కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఎక్స్ ఏఐను అమెరికా కు అతి తక్కువ ధరకే అందుబాటులో వచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు.
భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పెద్ద బాంబ్ పడేశారు. ఫార్మాపై 100 శాతం సుంకాలను విధిస్తున్నామని ప్రకటించారు. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు.
ఆసియా కప్ టోర్నీలో మొత్తానికి గెలుస్తూ, ఓడుతూ పాకిస్తాన్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. ఈ రోజు బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో ఓడించింది పాక్ జట్టు. ఫైనల్ లో టీమ్ ఇండియాతో తలపడనుంది.
ఐసీసీ చేతిలో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ కు గట్టిగా చివాట్లు పడ్డాయి. ఇంకో సారి ఇలా చేయకూడదంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. పాకిస్తాన్ తో మ్యాచ్ తర్వాత ఆ విజయాన్ని పహల్గాందాడికి అంకితం ఇస్తున్నట్లు కెప్టెన్ స్కై ప్రకటించడమే దీనికి కారణం.