Pharma: ట్రంప్ మరో బాంబు.. ఫార్మాపై 100శాతం సుంకాలు

భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో పెద్ద బాంబ్ పడేశారు. ఫార్మాపై 100 శాతం సుంకాలను విధిస్తున్నామని ప్రకటించారు. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు.

New Update
Trump

Trump

ఒకవైపు భారత్ ఓ సంబంధాలు తమకు చాలా మంచిదని చెబుతూనే..మరోవైపు బాదేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump). వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్యా చర్చలు జరుగుతున్న సమయంలో తాజాగా ఈరోజు ట్రంప్ ఫార్మాపై 100 సుంకాలతో విరుచుకుపడ్డారు(donald trump tariffs on india). బ్రాండెడ్, పేటెంట్ పొందిన మందులపై వంద శాతం సుంకాన్ని విధిస్తామని అనౌన్స్ చేశారు. ఇవి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు.  అమెరికాలో మెడిసన్ తయారీ పరిశ్రమ ఉంటేనే సుంకాలు ఉండవని చెప్పారు.  దీనికి సంబంధించి ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

ప్రస్తుతం అమెరికా, భారత్ ల మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయి.  భారత్ ఇప్పటికే 50 శాం సుంకాలను ఎదుర్కొంటోంది. దానికి తోడు రష్యఆ నుంచి చమురు కొనుగోలు చేసినందుకు గానూ మరో 25 శాతం అదనపు సుంకాలను కూడా వేసింది ట్రంప్ గవర్నమెంట్. వీటిపై కొన్ని రోజుల క్రితమే చర్చలు ప్రారంభించాయి అమెరికా, భారతదేశాలు. వీటి మధ్యలోనే ఈ రోజు మళ్ళీ ఫార్మాలపై వంద శాతం సుంకాలను బాదేస్తూ ట్రంప్ అనౌన్స్ చేశారు. 

Also Read :  పాక్ ప్రధాని , ఆర్మీ చీఫ్ లకు అవమానం...వైట్ హౌస్ లో ఉండి వెయిట్ చేయించిన ట్రంప్

అమెరికాకు భారత్ నుంచే ఎక్కువ మెడిసన్..

అమెరికాకు జెనరిక్ ఔషధాలను(pharma) ఎగుమతి చేసే అతిపెద్ద దేశం భారతదేశం. 2024లో దాదాపు $8.73 బిలియన్ల విలువైన ఔషధాలను అమెరికాకు ఎగుమతి చేసింది. ఇది దాని మొత్తం ఔషధ ఎగుమతుల్లో దాదాపు 31% వాటాను కలిగి ఉంది. అమెరికాలో జెనరిక్ మందులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. దాంతో పాటూ యూఎస్ లో డాక్టర్లు రాసే మందుల్లో ఎక్కువ శాతం భారత్ నుంచి తయారయి వచ్చేవే ఉంటాయి.   IQVIA అంచనా ప్రకారం భారతీయ జెనరిక్ మందులు 2022లో US ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు $219 బిలియన్లు మరియు 2013, 2022 మధ్య $1.3 ట్రిలియన్లు ఆదా చేశాయి. డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, లుపిన్,  అరబిందో వంటి ప్రధాన కంపెనీలు అమెరికా మార్కెట్ పై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.  అయితే వీటిల్లో ఏ కంపెనీఇ అయినా అమెరికాలో తయారీ పరిశ్రమలు ఉన్నట్లైతే మాత్రం అవి సుంకాలను నుంచి తప్పించుకోగలవు.  కంపెనీలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నా కూడా సుంకాలు వర్తించవని ట్రంప్ చెప్పారు. 

ఈరోజు ప్రకటించిన సుంకాల్లో ఫార్మాతో పాటూ మరికొన్ని ఉన్నాయి. భారీ ట్రక్కులు, కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ వానిటీ, అప్ హోల్టర్స్ ఫర్నిచర్ వంటివాటిపై 25 శాతం నుంచి 50 వాతం వరకు సుంకాలను విధించారు. ఇవన్నీ కూడా అక్టోబర్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. 

Also Read :  ప్రపంచ శ్రామికశక్తిని ఎవరూ ఆపలేరు..హెచ్ 1బీ వీసా ఫీజుల పెంపుపై విదేశాంగ మంత్రి జైశంకర్

Advertisment
తాజా కథనాలు