Captain Sky: పహల్గాం దాడిపై వ్యాఖ్యలు...భారత కెప్టెన్ కు వార్నింగ్ ఇచ్చిన ఐసీసీ

ఐసీసీ చేతిలో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ కు గట్టిగా చివాట్లు పడ్డాయి. ఇంకో సారి ఇలా చేయకూడదంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. పాకిస్తాన్ తో మ్యాచ్ తర్వాత ఆ విజయాన్ని పహల్గాందాడికి అంకితం ఇస్తున్నట్లు కెప్టెన్ స్కై ప్రకటించడమే దీనికి కారణం.

New Update
india win over pakistan suryakumar yadav dedicated  to pahalgam victims

india win over pakistan suryakumar yadav dedicated to pahalgam victims

భారత కెప్టెన్ సూర్యకుమార్ ఈరోజు రిచీ రిచర్డ్సన్ ఆధ్వర్యంలో ఐసీసీ నిర్వహించిన విచారణకు హాజరయ్యాడు. బీసీసీఐ ప్రతినిధులతో కలిసి స్కై దీనికి హాజరయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతనికి ఐసీసీ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఆసియా కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ అనంతరం పూర్యకుమార్ చేసిన వ్యాఖ్యలపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయాలను, క్రీడలను కలపకూడదంటూ హెచ్చరించింది. ప్రస్తుతానికి కేవలం హెచ్చరికలతో సరిపెట్టినా..మళ్ళీ ఇలాంటివి రిపీట్ అయితే చర్యలు తప్పవని ఐసీసీ చెప్పినట్టు తెలుస్తోంది.  అయితే దీనికి ముందు సూర్యకుమార్ కు జరిమానా లేదా డీమెరిట్ పాయింట్ విధించే అవకాశం ఉందని పలు జాతీయ మీడియా కథనాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం అవేమీ విధించినట్టు సమాచారం రాలేదు.  

పహల్గాందాడి బాధితులకు అంకితం...

సెప్టెంబర్ 14న ఆసియా కప్ లో భారత్ , పాకిస్తాన్ లు మొదటి మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ చెప్పుకునేంత రసవత్తరంగా అయితే సాగలేదు. చాలా చాలా నీరసంగా జరిగిందనే చెప్పాలి. పాకిస్తాన్ బ్యాటర్లను కేవలం అతి తక్కువ పరుగులకే భారత్ బౌలర్లు కట్టడి చేశారు. అనంతరం చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించారు. పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించి ఓడించింది. ఇలా ఆసియా కప్ టోర్నీ 2025లో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

కానీ మ్యాచ్ తరువాత జరిగిన పరిణామాలు మాత్రం ఆసక్తికరంగా సాగాయి. వాటిల్లో భారత కెప్టెన్ సూర్యకుమార్ ఆఫ్టర్ మ్యాచ్ స్పీచ్ ఒకటి.  మ్యాచ్ తరువాత మీడియాతో స్కై మాట్లాడుతూ.. ఈ గెలుపు పహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు, అలాగే ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన సాయుధ దళలన్నింటికీ అంకితం అని తెలిపారు. అతడి మాటలతో క్రికెట్ అభిమానులు, ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. సూర్య కుమార్ మాట్లాడుతూ.. ‘‘పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడి నన్ను ఎంతో బాధించింది. అందువల్ల బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని నేను ఎంతో భావిస్తున్నాను. ఈ గెలుపుతో బాధిత ఫ్యామిలీలకు మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ విజయాన్ని ఎంతో ధైర్యసాహసాలు చేసిన మన సాయుధ దళాలన్నింటికీ అంకితం చేయాలనుకుంటున్నాము. మనందరికీ వారు స్ఫూర్తినిచ్చారు.. ఇస్తూనే ఉంటారు. అవకాశం వచ్చినప్పుడల్లా వారి ముఖాల్లో చిరునవ్వు నింపేందుకు మా వంతు ప్రయత్నం చేస్తుంటాం’’ అంటూ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. కానీ ఇదే సూర్యకుమార్ ను ఇబ్బందుల్లో పడేసింది. ఐసీసీ ముందు విచారణకు హాజరయ్యేలా చేసింది. దానికి తోడు వార్నింగ్ లు కూడా ఎదుర్కోవలసి వచ్చింది. 

Advertisment
తాజా కథనాలు