/rtv/media/media_files/2025/09/26/trump-h1b-visa-2025-09-26-10-00-08.jpg)
యూఎస్ హెచ్ 1బీ వీసా(h1b visa) ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) నిర్ణయం తీసుకున్నారు. దీనిపై చాలానే గందగోళం రేగింది. భారత్, చైనా దేవాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. దాంతో పాటూ లాటరీ విధాన్ని తీసేస్తామని కూడా ప్రకటించింది ట్రంప్ ప్రభుత్వం. దీని వలన అమెరికాలో ఉన్న టెక్ కంపెనీలే నష్టపోతాయన్నది వాస్తవం. అయితే ఇప్పటి వరకూ ఏ కంపెనీ కూడా ట్రంప్ ను హెచ్ 1బీ వీసాల విషయమై ప్రశ్నించలేదు. కానీ ట్రంప్ ఈ అనాలోచిత నిర్ణయంపై ఎదురు దెబ్బ తప్పదని చెబుతున్నారు. ఎందుకంటే వీసా ఫీజు పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికాలో అతిపెద్ద వ్యాపార సంస్థల సమూహమైన యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో కేసు వేయడానికి రంగం సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. సాధారణంగా ట్రంప్ తో నేరుగా విభేదించడానికి ఇష్టపడని ఈ సంస్థ, ఇప్పుడు ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోందని చెబుతున్నారు.
Also Read : అమెరికా పొమ్మంది.. జర్మనీ రమ్మంటోంది
ట్రంప్ VS ఛాంబర్ ఆఫ్ కామర్స్
అమెరికాలో ఉన్న మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా, వాల్ మార్ట్ వంటి దిగ్గజ సంస్థలతో సహా దేశంలోనే అత్యధిక కంపెనీల సభ్యత్వం కలిగిన వ్యాపార సంస్థల లాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇదిపోరాటంలోకి దిగితే ఎదురు నిలబడడం కాస్త కష్టమే. ఇప్పటి వరకు టెక్ కంపెనీలు విడిగా ట్రంప్ హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. కానీ ఇప్పుడు వారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గనుక కేసు వేస్తే, ట్రంప్ తో వీరు కోర్టులో పోరాడటం ఇది రెండోసారి అవుతుంది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను నిలిపివేశారు. అప్పుడు కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయనపై ఫెడరల్ కోర్టు కేసు వేసి గెలిచింది. ఫెడరల్ కోర్టు ట్రంప్ ఆదేశాలను రద్దు చేసింది.
ఆందోళనలో టెక్ కంపెనీలు...
ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై దాదాపు అన్ని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హెచ్ 1బీ వీసాతో టెక్ కంపెనీలు తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను నియమించకుంటున్నాయని...దాని వలన అమెరికాలో జనాలకు ఉద్యోగాలు తక్కువ అయిపోతున్నాయన్నది ట్రంప్ గోల. ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయంవలన అమెరికా ప్రజలతో పాటూ టెక్ కంపెనీలు కూడా సంతోషిస్తాయని చెప్ఆరు. కానీ నిజానికి అవన్నీ కూడా ఈ నిర్ణయంపై విపరీతమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కంపెనీల సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉందని భయపడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి పోరాటికి సిద్ధమయ్యాయని అంటున్నారు.
మరోవైపు యాపిల్, అమెజాన్, జేపీమోర్గాన్ వంటి ప్రధాన కంపెనీలకు అమెరికా చట్ట సభ్యులు లేఖలు రాసినట్టుగా సమాచారం. ఇందులో H-1B వీసాలపై వేలాది విదేశీ ఉద్యోగులు నియమించుకోవడంపై వివరణ కోరారని చెబుతున్నారు. దాంతో పాటూ అమెరికన్ల ఇతర ఉద్యోగ అవకాశాలను తగ్గించడం పట్ల వారు ప్రశ్నలు లేవనెత్తారు. రిపబ్లికన్ సెనేటర్ చక్ గ్రాస్లీ, డెమొక్రటిక్ సెనేటర్ డిక్ డర్బిన్ నేతృత్వంలో ఈ లేఖలు పంపారని తెలుస్తోంది. కంపెనీలు ఎంతమంది హెచ్ 1బీ ఉద్యోగులను నియమించుకున్నాయి.. వారికి ఇచ్చే జీతాలు ఎంత.. విదేశీ ఉద్యోగల కోసం స్థానికులను తప్పించారా లేదా అనే వివరాలను ఇవ్వాలని కోరారు.