/rtv/media/media_files/2025/03/04/H8NhAN41cgEaBdRxKNpW.jpg)
Trump, US Stock Markets
ఈ వారం అంతా దేశీ స్టాక్ మార్కెట్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదనపు సుంకాలు, హెచ్ 1బీ వీసాల ఫీజు పెంపులు ఇప్పటికే మార్కెట్లను దిగజార్చాయి. వాటికి తోడు ఈ రోజు ఫార్మాపై ట్రంప్ విధించిన వంద శాతం సుంకాలు భారత మార్కెట్ ను మరింత దెబ్బ తీశాయి. ఈ దెబ్బకు స్టాక్ మార్కెట్ పడిపోయింది. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు తగ్గి 80,760 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 110 పాయింట్లు తగ్గి 24,770కి చేరుకుంది. 30 సెన్సెక్స్ స్టాక్ లలో 22 నష్టపోగా.. 8 లాభాల్లో ఉన్నాయి.
కుదేలయిన ఫార్మా స్టాక్స్..
ఈరోజు మార్కెట్లో ఫార్మీ స్యూటికల్ స్టాక్ లు అతి పెద్ద క్షీణతను చూస్తున్నాయి. సన్ ఫార్మా, సిప్లా, అరబిందో ఫార్మా, లుపిన్, జైడస్ లైఫ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ వంటి ఫార్మా స్టాక్ లు 4% వరకు నష్టపోయాయి. మరోవైపు నిఫ్టీలో లార్సెన్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, హీరో మోటోకార్ప్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సిప్లా, ఆసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్ స్టాక్స్ నష్టాల్లో కదలాడుతున్నాయి. భారత ఫార్మీకు అమెరికాతో అతిపెద్ద మార్కెట్ ఉంది. అక్కడ డాక్టర్లు రాసే మందుల్లో దాదాపు 80 శాతం బారత్ నుంచే ఎగుమతి అవుతాయి. అలాగే జెనరిక్ మెడిసన్స్ కూడా అమెరికాలో బాగా పాపులర్. అందుకే ట్రంప్ ఫార్మాపై వందశాతం టారిఫ్ లు ప్రకటించగానే స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్లలోనూ క్షీణత..
ట్రంప్ టారిఫ్ ల ప్రభావం ఒక్క భారత్ పైనే కాదు ప్రపంచ మార్కెట్ మీద కూడా ప్రబావం చూపిస్తున్నాయి. అవి కూడా నష్టాల్లో కదలాడుతున్నాయి. ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ 0.41% తగ్గి 45,566.58 వద్ద ఉండగా కొరియా కోస్పి 3,382 వద్ద స్థిరంగా ట్రేడవుతున్నాయి. హాంకాంగ్ కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.61% తగ్గి 26,323 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.18% తగ్గి 3,846 దగ్గర ముగిశాయి. మరోవైపు సెప్టెంబర్ 25న US డౌ జోన్స్ 0.38% తగ్గి 45,947 వద్ద ముగిసింది. నాస్ డాక్ కాంపోజిట్ 0.50% , S&P 500 0.50% పడిపోయాయి.