USA-Pakistan: పాక్ ప్రధాని , ఆర్మీ చీఫ్ లకు అవమానం...వైట్ హౌస్ లో ఉండి వెయిట్ చేయించిన ట్రంప్

ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్, ఆర్మీ ఛీఫ్ ఆసిఫ్ మునీర్ లు సమావేశం అయ్యారు. అయితే ట్రంప్ వైట్ హౌస్ లోనే ఉన్నా ఆయన కోసం వారు చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది.  అసలేం జరిగింది? ఎందుకు ట్రంప్ పాక్ ప్రధానిని అవమానించారు?

New Update
trump-shehabaz

పాపం పాక్ కు ఎక్కడికెళ్ళినా అవమానాలు తప్పడం లేదు.  ఆ దేశాన్ని వారి నాయకులను చాలా దేవాలు పెద్దగా పట్టించుకోవు. దానికి కారణం వారి చేష్టలే అయినా..అవమానాలు మాత్రం కామన్. తాజాగా మరోసారి పాకిస్తాన్(pakistan) నేతలకు మరోసారి అవమానం ఎదురైంది. ఈ రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను పాక్ ప్రధాని షహబాజ్ షెరీఫ్, ఆర్మీ ఛీప్ ఆసిమ్ మునీర్ లు కలిశారు. అయితే దీని కోసం వారిద్దరూ వఔట్ హౌస్ లో చాలా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. వౌట్ హౌస్ లోనే ట్రంప్ ఉన్నప్పటికీ ఆయన కోసం పాక్ నేతలు ఎదురు చూడక తప్పలేదు.

Also Read :  సొంత పౌరులపై పాక్ బాంబులు.. మరో 13 మందిని చంపి.. ఏం చేసిందంటే?

30 నిమిషాలు వెయింగ్

పాక్ నేతల అవమానానికి కారణం చైనా(china) నే అని చెబుతున్నారు. ప్రధాని షహబాజ్, ఆర్మీ ఛీఫ్ మునీర్ వౌట్ హౌస్ కు వెళ్ళిన సమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా సోషల్ మీడియా టిక్ టాక్ తో ఒప్పందం కుదుర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఈరోజు ఆయన టిక్ టాక్ కు సంబంధించి కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు.  దాని తరువాత మీడియా మీటింగ్ కూడా జరిగింది. అయితే ఇవన్నీ జరుగుతున్నంత సేపూ పాక్ ప్రధాని, ఆర్మీ ఛీప్ మునీర్ లు వౌట్ హౌస్ వెలుపల దాదాపు 30 నిమిషాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. టిక్ టాక్ ఒప్పందం, విలేకరుల సమావేశం ముగిశాకనే ట్రంప్ వారిద్దరినీ కలిశారు. 

ఏదో జరుగుతోంది...

అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump), పాకిస్తాన్ ప్రధాని షహబాజ్(Pakistan PM Shabaz Sharif), ఆర్మీ ఛీఫ్ మునీర్ లు దాదాపు గంటా 20 నిమిషాల సేపు సమావేశం అయ్యారని చెబుతున్నారు. అంతకు ముందు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా ట్రంప్ తో సమావేశమైన ఎనిమిది అరబ్ లేదా ముస్లిం దేశాల ఉన్నతాధికారులలో షాబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు.  ఈరోజు ఓవల్ ఆఫీసులో అధినేత సమావేశం జరిగింది. దీనికి మీడియాను కూడా అనుమతించలేదు. పాక్ ప్రధాని వెంట ఆర్మీ చీప్ మునీర్ ఉండగా...ట్రంప్ తో పాటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్ లో ఇరు నేతలూ ఏ విషయంపై చర్చించారని మాత్రం బయటకు రాలేదు.  కానీ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందని మాత్రం తెలుస్తోంది. రష్యా చమురు కారణంగా అమెరికాతో భాత్ సంబంధాలు బలహీనమయ్యాయి. అప్పటి నుంచి అగ్రరాజ్యానికి దగ్గర కావాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.  ఈక్రమంలో ఈరోజు జరిగిన ట్రంప్, షహబాజ్ సమావేశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.  

Also Read: Jai shankar: ప్రపంచ శ్రామికశక్తిని ఎవరూ ఆపలేరు..హెచ్ 1బీ వీసా ఫీజుల పెంపుపై విదేశాంగ మంత్రి జైశంకర్

Advertisment
తాజా కథనాలు