/rtv/media/media_files/2025/09/26/jai-shankar-2025-09-26-08-56-56.jpg)
బుధవారం న్యూయార్క్(new-york) లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్(jai-shankar) పాల్గొన్నారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇందులో ట్రంప్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన హెచ్ 1 బీ వీపా(h1b visa) ఫీజుల పెంపు పై జైశంకర్ విరుచకుపడ్డారు. జాతీయ జనాభా కారణంగా అనేక దేశాలలో ప్రపంచ శ్రామిక శక్తి కోసం డిమాండ్లను తీర్చలేమనే వాస్తవికత నుండి దేశాలు తప్పించుకోలేవని ఆయన అన్నారు. ట్రంప్ రూల్స్ వలన భారత్ వంటి దేశాలు చాలా నష్టపోతాయని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన, సమాకాలీన, సమర్థవంతమైన శ్రామిక శక్తి నమూనాను రూపొందించాలని పిలుపునిచ్చారు జైశంకర్.
Also Read : రిలయన్స్ కీలక నిర్ణయం.. రూ.40 వేల కోట్లతో దేశవ్యాప్తంగా ఫుడ్ యూనిట్స్
వాస్తవికత నుంచి తప్పించుకోలేరు...
శ్రామిక శక్తికి సంబంధించిన అంశం బహుశా రాజకీయ అంశమే కావచ్చును కానీ దాని నుంచి తప్పించుకునే అవకాశం లేదని జైశంకర్ అన్నారు. ట్రంప్ వీసా ఫీజుల పెంపు ద్వారా ఇతర దేశస్తులను ఆపేయడం మంచి విషయం కాదని చెప్పారు. చాలా దేశాలలో ఉద్యోగాల కంటే జనాభా ఎక్కువగా ఉంటారు. అటువంటప్పుడు మిగతా దేశాలకు వలస వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి వారినిఅడ్డుకుంటే కష్టమౌతుందని ఆయన వివరించారు. హెచ్ 1బీ వీసా ఫీజుల పెంపు, లాటరీ పద్ధతిని తీసేయడం వంటివి భారత నిపుణులను ఎక్కువ ప్రభావితం చేస్తుందని చెప్పుకొచ్చారు. ప్రపంచ శ్రామిక శక్తి ఒక వాస్తవం అని...దాని నుంచి ట్రంప్ పారిపోలేరని జైశంకర్ అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఉన్న అడ్డంకులను తప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని జైశంకర్ తెలిపారు. ఒక్క అమెరికాతోనే కాకుండా తమ పరిధిని మరిన్ని దేశాలతో విస్తరించేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. వాణిజ్య కార్యకలాపాలను సుస్థిరపరచుకోవడం ద్వారా సింగిల్ మార్కెట్, ఒకే సరఫరాదారుపై ఆధారపడటం తగ్గించుకోవాలని గ్లోబల్ సౌత్ దేశాలకు జైశంకర్ విజ్ఞప్తి చేశారు. మహమ్మారి నుంచి తేరుకోక ముందే ఉక్రెయిన్, గాజా యుద్ధాలు మొదలు ప్రతికూల వాతావరణ సంఘటనలు, అస్థిర వాణిజ్యం.. పెట్టుబడుల ప్రవాహం, వడ్డీ రేట్లలో అనిశ్చితితోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అజెండాలో గణనీయ క్షీణత కనిపించడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని...ఇటువంటి సమయంలోనే అందరూ కలిపి పని చేయాలని అన్నారు.
Also Read: Trump-Musk: మళ్ళీ కలిసిపోయిన ట్రంప్, ఎలాన్ మస్క్..ట్రంప్ ప్రభుత్వంతో ఎక్స్ ఏఐ ఒప్పందం