Trump-Musk: మళ్ళీ కలిసిపోయిన ట్రంప్, ఎలాన్ మస్క్..ట్రంప్ ప్రభుత్వంతో ఎక్స్ ఏఐ ఒప్పందం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ నంబర్ వన్ బిలయనీర్ ఎలాన్ మస్క్ లు మళ్ళీ ఒక్కటయ్యారు. ట్రంప్ ప్రభుత్వంతో మస్క్ మరోసారి కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. ఎక్స్ ఏఐను అమెరికా కు అతి తక్కువ ధరకే అందుబాటులో వచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నారు.

New Update
trump, musk

అమెరికా అధినేత ట్రంప్(Donald Trump), టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్(Elon Musk) మళ్ళీ కలిసిపోయారు. చార్లీ కిర్క్ సంస్మరణ సభలో ఇద్దరూ ఒకే చోట కూర్చుని మాట్లాడుకోవడం అందరూ గమనించారు. దీని తరువాత ఎలాన్ మస్క్ ట్రంప్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది.  ఎక్స్ ఏఐను అమెరికా కు అతి తక్కువ ధరకే అందుబాటులో వచ్చేటట్టు చేశారు.  అమెరికాలోని ఫెడరల్ ఏజెన్సీలు నామమాత్రపు ధరకే ఎక్స్ చాట్ బాట్ గ్రోక్ ను ఉపయోగించుకోవచ్చును.  జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ తో ఈ ఒప్పందం చేసకున్నారు మస్క్. దీని ప్రకారం రాబోయే 18 నెలల్లో గ్రోక్ ను యాక్సెస్ చేయడానికి కేవలం 42 సెంట్లు మాత్రమే చెల్లిస్తాయి.  దాంతో పాటూ ఎక్స్ ఏఐ ఇంజినీర్లు కూడా చాట్ బాట్ ను అమలు చేయడంలో ఏజెన్సీలకు సాయం చేస్తారు. 

Also Read :  ట్రంప్ కు ఎదురుదెబ్బ..హెచ్ 1బీ వీసా ఫీజుల పెంపుపై కోర్టుకు వెళ్ళనున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్

ట్రంప్ ప్రభుత్వంతో పని చేసేందుకు.. 

ట్రంప్, ఆయన ప్రభుత్వంతో విభేదాల తర్వాత ఎలాన్ మస్క్ ఇప్పుడే మొదటిసారిగా ఒప్పందం చేసుకున్నారు.  దీనిపై మస్క్ మాట్లాడుతూ దేశ ప్రయోజనం కోసం ప్రభుత్వం అంతటా గ్రోక్ ఏఐని వేగంగా అమలు చేయడానికి...అధ్యక్షుడు ట్రంప్, అతని బృందంతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని మస్క్ చెప్పారు. దాంతో పాటూ చాట్ జీపీటీ, ఆంత్రోపిక్ ల ప్రాభావాన్ని తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తున్నామని మస్క్ చెప్పారు.  ఈ రెండు సంస్థలు కూడా అమెరికా ప్రభుత్వంతో  ఒప్పందం చేసుకున్నాయి. ఇవి రెండు చాట్ బాట్ యాక్సెస్ కోసం ఏజెన్సీల నుంచి 1 డాలర్ మాత్రమే వసూలూ చేస్తున్నాయి. 

దీని కంటే ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బిలియనీర్ ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు తలెత్తాయి. బహిరంగంగానే ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శ చేసుకున్నారు.  అప్పటి నుంచి స్నేహితులు ఇద్దరూ బద్ధ శత్రువుల్లా ప్రవర్తిస్తున్నారు.  ఈక్రమంలో ఇరువురు నేతలూ రీసెంట్ గా కలిశారు. ఇటీవలే హత్యకు గురైన రైట్ వింగ్ నేత చార్లీ కిర్క్ సంస్మరణ సభలో భాగంగా ఆదివారం అరిజోనాలోని గ్లెన్ డేల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో వారు ఇద్దరు పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు.  ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎంతో సన్నిహితుడిగా, ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న ఎలాన్ మస్క్.. కొన్ని నెలల క్రితం ట్రంప్ ప్రభుత్వం నుంచి అకస్మాత్తుగా బయటకు వచ్చారు. ముఖ్యంగా 'డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ' (DOGE) అనే సంస్థకు ఆయన నాయకత్వం వహించారు.  

Also Read: BIG BREAKING: ట్రంప్ మరో బాంబు..ఫార్మాపై 100శాతం సుంకాలు

Advertisment
తాజా కథనాలు