UN Meeting:నీ మాటలు ఎవడు వింటాడు..ఐరాసలో నెతన్యాహు స్పీచ్ కు అవమానం

ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల్లో  ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు అనుకోని సంఘటన ఎదురైంది.  ఆయన మాట్లాడుతుండగా..మిగతా దేశాలకు చెందిన ప్రతినిధులు అక్కడి నుంచి వాకౌట్ చేశారు. 

New Update
netanyahu

ఐక్యరాజ్య సమిత సర్వసభ్య సమావేశాలు న్యూ యార్క్ లో జరుగుతున్నాయి. వీటిల్లో ఈరోజు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రసంగించారు. అయితే ఆయన మాట్లాడుతుండగా అనుకోని అవమానం ఎదురైంది.  ప్రసంగం జరుగుతుండగానే చాలా దేశాలకు చెందిన ప్రతినిధులు వాకౌట్ చేశారు. నెతన్యాహు ప్రసంగాన్ని నిరసించారు. దీంతో సమావేశం హాలు కాళీగా కనిపించింది.  అయితే మరోవైపు అమెరికాతో సహా పలు దేశాల ప్రతినిధులు మాత్రం నెతన్యాహుకు మద్దతుగా నిలబడ్డారు.  ఆయన ప్రసంగానికి చప్పట్లు కొడుతూ మద్దతు పలికారు. 

గాజా ఆపరేషన్ ను పూర్తి చేస్తాం..

ఐరాసలో కూడా నెతన్యాహు హమాస్ పాటే పాడారు. దానిని తుడిచిపెట్టే వరకూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. గాజాలో ఆపరేషన్ ను పూర్తి చేస్తామని చెప్పారు.  పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించే విషయమై మాట్లాడుతూ...అది మంచి నిర్ణయం కాదని అన్నారు. యూదులు, అమాయక ప్రజలపై ఉగ్రవాదానని ప్రోత్సహించడమే అవుతుందని చెప్పారు.  ఇందులో పాశ్చాత్య దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గదని స్పష్టం చేశారు. ది కర్స్.. పేరుతో రూపొందించిన మ్యాప్ ను చూపిస్తూ నెతన్యాహు మాట్లాడారు. పశ్చిమాసియాలో మార్పులు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని అన్నారు. మరోవైపు నెతన్యాహు ప్రసంగాన్ని గాజాలో పౌరులకు లౌడ్ స్పీకర్లు పెట్టి మరీ వినిపించారు. 

Advertisment
తాజా కథనాలు