US Flight Accident: అమెరికాలోని శాండియాగోలో కూలిన మరో విమానం
అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. సెసనా సిటేషన్ 2 అనే అనే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ శాండియాగోలో ఇళ్ళపై కూలిపోయింది. ఈ ఘటనలో 15 ఇళ్ళు, వాహనాలతో పాటూ పలువురు చనిపోయారని తెలుస్తోంది.
అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. సెసనా సిటేషన్ 2 అనే అనే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ శాండియాగోలో ఇళ్ళపై కూలిపోయింది. ఈ ఘటనలో 15 ఇళ్ళు, వాహనాలతో పాటూ పలువురు చనిపోయారని తెలుస్తోంది.
భారత్, పాక్ కాల్పుల విరమణ విషయాన్ని తమ రెండు దేశాలే చర్చించుకుని నిర్ణయించుకున్నాయని.. అమెరికాను వేలు పెట్టనివ్వలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ మరోసారి గట్టిగా చెప్పారు. ట్రంప్ తానే యుద్ధాన్ని ఆపానని పదే పదే చెప్పుకుంటున్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ అబద్ధాలకు అంతు లేకుండా పోతోంది. నిన్న స్కూల్ బస్సుపై అటాక్ చేశారని చెప్పిన వార్తలో నిజం లేదని తెలుస్తోంది. తాము పాక్ ఆర్మీ వాహనంపై దాడి చేశామని స్కూల్ బస్సుపై కాదని బలూచ్ రెబల్స్ చెబుతున్నారు.
ట్రంప్‌కు షాకిచ్చారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా. ఈరోజు జరిగిన భేటీలో ఇద్దరు అధ్యక్షులు కొట్టుకున్నారు. సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి జరిగిందని ఒకరు, జరగలేదని మరొకరు వాదులాడుకున్నారని తెలుస్తోంది.
ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వార్ చనిపోయే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. మే నెల ప్రారంభంలో దక్షిణ గాజాలో ఐడీఎఫ్ ఒక ఆసుపత్రిపై దాడి చేసిందని..అందులో సిన్వర్ చనిపోయాడని చెప్పారు.
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు పోలీసులు. ఆమెకు అన్నే తెలిసే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ అధికారులతో మాత్రం సంప్రదింపులు కొనసాగించిందని అంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈరోజు ఓ రిపోర్టర్ పై విరుచుకుపడ్డారు. గెట్ అవుట్ అంటూ ఫైర్ అయ్యారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి నువ్వడిగే ప్రశ్న ఏంటంటూ మండిపడ్డారు. అసలెవరు నీకు ఈ ఉద్యోగం ఇచ్చారని ట్రంప్ ఫైర్ అయ్యారు.
వేగంగా పికప్ కావాలంటే టిప్ ఇవ్వాలి అనే అడ్వాన్స్ టిప్ మోడల్ ను ప్రవేశపెట్టింది ఊబర్. దీనిపై కేంద్రం మండిపడింది. ఈ పద్ధతి చాలా అన్యాయమని...ఊబర్ యాజమాన్యం వెంటనే దీనికి సమాధానం ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు.
ప్రతీకార సుంకాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ తో సహా అన్ని దేశాలపైనా సుంకాలు విధించారు. వాటిపై పూర్తి మినహాయింపు ఇవ్వాలని అమెరికాను భారత్ కోరుతోంది. దీనిపై జూలై 8లోగా ఒక మధ్యంతర ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.