/rtv/media/media_files/2025/05/22/P6h1PEHqwv4VHHRbgTdV.jpg)
school bus Attack
పాకిస్తాన్ ప్రభుత్వం, మీడియా తమకు అనుగుణంగా అన్నింటినీ మార్చేసుకుంటున్నారని బలూచిస్తాన్ రెబల్స్ అంటున్నారు. దానికి ఉదాహరణ నిన్న స్కూల్ బస్సు ఉదంతమేనని చెబుతున్నారు. తాము నిన్న పాకిస్తాన్ ఆర్మీ వాహనంపై దాడి చేశామని..స్కూల్ బస్సు పై కాదని తేల్చి చెప్పారు. తమ దాడిలో పాక్ ఆర్మీ జవాన్లు ఇద్దరు మహ్మద్ ఇక్బాల్, మొహమ్మద్ ఖాదిర్ లు చనిపోయారని తెలిపారు. చిన్నారులు, మరో 38 మంది చనిపోయారనిచెప్పడం అవాస్తవమని బలూచ్ రెబల్స్ కొట్టిపారేశారు.
BIG: Khuzdar suicide attack in Balochistan targeted a bus carrying Pakistan Army soldiers, not school children as claimed. Pakistani military spreading false narratives through media to cover up their failure. Two Pak Army soldiers Muhammad Iqbal and Sardar Muhammad Qadir killed. pic.twitter.com/yyH9u4t1I0
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 21, 2025
అంతా అబద్ధమే..అన్నీ నాటకాలే..
పాకిస్థాన్‌లో మరోసారి భారీ ఉగ్రదాడి జరిగిందని.. బలూచిస్థాన్లో ఖుజ్దార్‌లో ఓ స్కూల్ బస్సుపై ఉగ్రవాదులు సూసైడ్ కారు బాంబు దాడికి పాల్పడ్డారని ప్రకటించారు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మరణించారు. మరో 38 మంది గాయాలపాలయ్యారు. స్కూల్ బస్సులో పిల్లలు ప్రయాణిస్తుండగానే ఈ ప్రమాదం జరిగిందని అక్కడి స్థానిక డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అయితే ఈ దాడి ఎవరు చేశారో అనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అయితే బలూచిస్థాన్ రెబల్స్ ఈ దాడులకు పాల్పడొచ్చని అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై పాకిస్థాన్ అంతర్గత మంత్రి మోసిన్ నఖ్వీ సైతం స్పందించారు. చనిపోయిన చిన్నారులకు ఆయన సంతాపం కూడా తెలియజేశారు.
today-latest-news-in-telugu | school-bus | balochisthan