ఏపీని కరోనా భయం వెంటాడుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలో అత్యధికంగా కరోనా కేులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 257కు పైగా కేసులు నమోదయినట్టు వైద్యశాఖ ెక్కలు చేపెట్టింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కోవిడ్ కేసు నోదయింది. విశాఖలో ఓ వివాహితకు కరోనా సోకింది. ఈమెతో పాటూ భర్త, పిల్లలకు కూడా వచ్చి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అందరికీ వైద్యులు ఆర్టీపీసీ పరీక్షలు నిర్వహించారు. వారం రోజులు పాటూ హోం క్వారంటైన్ ఉండాలని వారికి సూచించారు. అయితే దీనిపై ప్రజలెవరూ గాభరా పడవద్దని...కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటే చాలని వైద్యులు చెబుతున్నారు.
మరోవైపు ప్రజలకు ఏపీ ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్‌లు, విమానాశ్రయాల్లో COVID-19 రూల్స్ పాటించాలని సూచించింది. కరోనా వైరస్‌పై మరోసారి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను అప్రమత్తం చేసింది.
కోవిడ్ పై ప్రజలకు ఆరోగ్య శాఖ సలహా:
1. ప్రార్థన మందిరాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, కార్యక్రమాలు వంటి అన్ని సామూహిక సమావేశాలను వెంటనే నిలిపివేయండి.
2. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లు & విమానాశ్రయాల్లో COVID-19 తగిన నియమాలను పాటించాలి.
3. వృద్ధులు (60 ఏళ్లు పైబడినవారు), గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా ఇంటి లోపలే ఉండాలి.
4. పరిశుభ్రతను పాటించండి. -తరచుగా చేతులు కడుక్కోండి. దగ్గు, తుమ్ముల బారినపడకుండా చూసుకోండి.
5. రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించండి. మాస్క్ ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుంది.
6. మీకు కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోండి. -
7. COVID ప్రభావిత దేశాల్లో ప్రయాణించిన వారు పరీక్షలు చేయించుకోవాలి.
8. సాధారణ లక్షణాలు: జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కారటం లేదా ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు లేదా విరేచనాలు
లక్షణాలు ఉన్నట్లైతే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లండి.
9. మీరు అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండండి.
అలాగే మాస్క్, పిపిఈ కిట్, ట్రిపుల్ లేయర్ మాస్క్‌లను తగినన్ని 24/7 ల్యాబ్‌లలో ఉంచాలని అన్ని ఆస్పత్రులకు సూచించింది.
today-latest-news-in-telugu | covid-cases | vizag