Trump - Ramaphosa Meeting: రసాభాసగా అమెరికా, దక్షిణాఫ్రికా అధ్యక్షుల భేటీ..ట్రంప్ కు అవమానం

ట్రంప్‌కు షాకిచ్చారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా. ఈరోజు జరిగిన భేటీలో ఇద్దరు అధ్యక్షులు కొట్టుకున్నారు. సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి జరిగిందని ఒకరు, జరగలేదని మరొకరు వాదులాడుకున్నారని తెలుస్తోంది. 

author-image
By Manogna alamuru
New Update

Trump - Ramaphosa Meeting: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాల సమావేశం హాట్ హాట్ గా జరిగింది. సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై మారణహోమం జరిగిందన్న ట్రంప్ ఆరోపించారు. జాత్యహంకార చట్టాలు, ముఖ్యమైన అంశాల నుంచి దృష్టి మళ్లిస్తున్నారంటూ ట్రంప్ ఆరోపించారు. ఇంతలో రామఫోసా కలుగజేసుకుని బాధితుల్లో నల్లజాతీయులే ఉన్నారని చెప్పుకొచ్చారు.

Also Read: USA: గెట్ అవుట్...అసలెవరు నీకు జర్నలిస్ట్ ఉద్యోగం ఇచ్చారు..రిపోర్టర్ పై ట్రంప్ ఆగ్రహం

దీంతో ట్రంప్ వైట్స్ కు సంబంధించిన వీడియోలు, కథనాలను ప్రదర్శించి చూపించారు. అక్కడ తమ రైతులపై జరుగుతున్న హింసను చూపించారు. శ్వేతజాతీయులపై దాడులు జరుగుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు. అయితే స్పాట్‌లోనే  ట్రంప్ వ్యాఖ్యలను ఖండించించారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా. సౌతాఫ్రికాలో శ్వేత జాతీయులపై ఎలాంటి హింస జరగలేదంటూ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ చూపించిన వీడియోను ఇప్పటి వరకు చూడలేదంటూ కొట్టిపారేశారు. దీని వెనుక ఏం జరిగిందో తెలుసుకుంటామంటూ ఆయన చెప్పారు. 

Also Read: పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ఢిల్లీలో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్‌

వరుసగా రెండు సార్లు అవమానం..

వైట్‌హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో ఇతర దేశాధ్యక్షులు ట్రప్ తో గొడవపడడం ఇది రెండోసారి. మొదటిసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ట్రంప్ కు షాకిచ్చారు. ఆయన అయితే ఏకంగా అరుచుకుంటూ సమావేశం మధ్యలోనే ఓవల్ ఆఫీస్ ను వదిలేసి వెళ్ళిపోయారు కూడా.  ఇప్పుడు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసాతో జరిగిన చర్చ కడా రసాభాస అయింది. ఇద్దరు అధ్యక్షులూ చాలాసేపే వాదులాడుకున్నారు. తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కూడా ట్రంప్ ఆ కోపాన్ని చూపించారు. రిపోర్ట్ ను ఏకంగా గెట్ అవుట్ అన్నారు. చివరకు దక్షిణాఫ్రికా అధ్యక్షడు వాతావరణాన్ని కూల్ చేయాల్సి వచ్చింది.

today-latest-news-in-telugu | usa | america president donald trump | south-africa

Also Read: Israel: మహ్మద్ సిన్వర్ ఖతం..కన్ఫార్మ్ చేసిన నెతన్యాహు

Also Read: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా

Advertisment
Advertisment
తాజా కథనాలు