IND-USA: జూలై 8లోగా అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం

ప్రతీకార సుంకాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ తో సహా అన్ని దేశాలపైనా సుంకాలు విధించారు. వాటిపై పూర్తి మినహాయింపు ఇవ్వాలని అమెరికాను భారత్ కోరుతోంది. దీనిపై జూలై 8లోగా ఒక మధ్యంతర ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

New Update
tariffs

Ind-usa tariffs

భారత్ పై అమెరికా 26శాతం ప్రతీకార సుంకాలను విధించింది. వీటిపై ఆ దేశం 90 రోజులు విరామం ప్రకటించింది. అయితే దాని తర్వాత మాత్రం కచ్చితంగా సుంకాలను అమల్లోకి తీసుకువస్తామని...ఏ దేశానికి మినహాయింపు లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పేశారు. దీంతో చాలా దేశాలు సుంకాలపై అమెరికాతో చర్చలు జరుపుతున్నారు. భారత్ కూడా చాలా రోజుల నుంచి తమకు టారీఫ్ లపై పూర్తి మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది. దీని మీద ఒక నిర్ణయానికి తొందరలోనే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. జూలై8లోగా ఇరు దేశాలు ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఒక ఉన్నతాధికారి తెలిపారు. అయితే ప్రతీకార సుంకాలను వాయిదా  వేసినా ప్రాథమిక సుంకం 10శాతం మాత్రం కొనసాగుతోంది.

జూ8 లోపు మధ్యంతర ఒప్పందం..

భారత్ , అమెరికా ల మధ్య వాణిజ్య ఒప్పందం మొదటి దశను వేగవంతం చేసే దిశగా అమెరికా వాణిజ్య మంత్రితో మంచి చర్చలు జరిగాయని మంత్రి గోయల్‌ తెలిపారు. యూఎస్‌ ట్రేడ్‌ రెప్రెజెంటేటివ్‌ జేమిసన్‌ గ్రీర్, అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్‌ లుత్నిక్‌లతో భారత వాణిజ్య మంత్రి పీయూశ్‌ గోయల్‌ వాషింగ్టన్‌లో చర్చలు జరిపారు. చర్చలు సానుకూలంగా నడిచాయని గోయల్ అన్నారు. జూలై8 లోగా కచ్చితంగా ఒక ఒప్పందానికి అయితే వస్తామని స్పష్టం చేశారు. 26% సుంకం, 10% ప్రాథమిక సుంకం భారత ఉత్పత్తులపై పడకుండా చూడడానికే ప్రయత్నిస్తున్నామని మంత్రి చెప్పారు. దాంతో పాటూ టారీఫేతర విషయాలు, ఇరు దేశాల మధ్యనా ఎగుమతి, దిగుమతి అవుతున్న వస్తువులు డిజిటల్ సేవలు లాంటివి కూడా చర్చల్లో భాగంగా ఉన్నాయని తెలుస్తోంది. 

జౌళి, రత్నాభరణాలు, తోలు వస్తువులు, గార్మెంట్లు, ప్లాస్టిక్స్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, అరటి పళ్లపై సుంకం తగ్గింపులను భారత్ కోరుతుంటే..పారిశ్రామిక వస్తువులు, వాహనాలు , వైన్, పెట్రో రసాయన ఉత్పత్తులు, డెయిరీ, వ్యవసాయ వస్తువులు, జన్యుమార్పిడి పంటల ఉత్పత్తులపై సుంకం తగ్గించాలని అమెరికా కోరుతోంది. 

today-latest-news-in-telugu | india | usa | donald trump tariffs

ఇది కూడా చూడండి: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు