/rtv/media/media_files/2025/05/22/jmqpar7Gdj3MBWXnwcaw.jpg)
Donald Trump
బుధవారం ఓవల్ కార్యాలయంలో ట్రంప్‌తో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా సమావేశం అయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడుతుండగా సడన్‌గా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీడియా ప్రశ్నలు విభాగంలో ఎన్బీసీ కి చెందిన విలేఖరి ఖతార్ బహూకరించిన విమానం గురించి ప్రశ్న అడిగారు. అలాంటి బహుమతి స్వీకరించడం నైతికమా అంటూ ట్రంప్ ను ప్రశ్నించారు. దీంతో ట్రంప్ కు విపరీతమైన కోపం వచ్చేసింది. అంతే వెంటనే ఆ రోపోర్టర్ పై కేకలేశారు. ఏం మాట్లాడుతున్నావ్..ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతుల సమస్యలు, హింస తదితర సమస్యల నుంచి దారి మళ్లించడానికే నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు. నువ్వు రిపోర్టర్ గా పనేికి రావు అంటూ మండిపడ్డారు ట్రంప్ . దాంతో పాటూ అతను పని చేస్తున్న వార్తా సంస్థ మీద కూడా కోప్పడ్డారు. దానిపై విచారణ జరపాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
400 మిలియన్ డాలర్ల విమానం..
రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖతార్ లో పర్యటించారు. అక్కడి రాజకుటుంబం ఆయనకు 400 మిలియన్ డాలర్లు విలువ చేసే విమానాన్ని బహూకరించారు. అయితే ట్రంప్ మాత్రం ఆ విమాన్ం తనకు కాదని..అమెరికా వైమానికి దళానికి అని చెప్పారు. కొత్త బోయింగ్‌లు వచ్చే వరకు ఈ విమానాన్ని ప్రభుత్వం తాత్కాలిక ఎయిర్ ఫోర్స్ వన్‌గా ఉపయోగిస్తామని వెల్లడించారు. ఇదే విషయాన్ని విలేఖరి కూడా చెప్పారు ట్రంప్. ఖతార్ వాళ్ళు ఇచ్చిన బహుమతి చాలా గొప్ప విషయం అంటూ అతనిపై కోపం వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా ఓవల్ ఆఫీస్ లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జోక్యం పుచ్చుకుని ‘‘క్షమించండి.. మీకు ఇవ్వడానికి నా దగ్గర విమానం లేదు.’’ అంటూ ట్రంప్‌ను రామఫోసా నవ్వించే ప్రయత్నం చేశారు.
today-latest-news-in-telugu | usa | 47th us president donald trump | reporter
Also Read: Uber: అలాంటి వేషాలు చెల్లవ్..ఊబర్ కు కేంద్రం నోటీసులు