Uber: అలాంటి వేషాలు చెల్లవ్..ఊబర్ కు కేంద్రం నోటీసులు

వేగంగా పికప్ కావాలంటే టిప్ ఇవ్వాలి అనే అడ్వాన్స్ టిప్ మోడల్ ను ప్రవేశపెట్టింది ఊబర్. దీనిపై కేంద్రం మండిపడింది. ఈ పద్ధతి చాలా అన్యాయమని...ఊబర్ యాజమాన్యం వెంటనే దీనికి సమాధానం ఇవ్వాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. 

New Update
cab

Uber Advance Tip

ఊబర్, ఓలా లాంటి  క్యాబ్ సర్వీసులు భారతదేశంలో చాలా మంది ఉపయోగిస్తుంటారు. చాలా మంది వీటిపై ఆధారపడే వారున్నారు. అయితే ఈ క్యాబ్ సర్వీసులు ఒక్కోసారి అనుకున్న టైమ్ కు దొరకవు. ఒకవేళ దొరికినా వెంటనే డ్రైవర్లు రారు. దీనికి చెక్ పెట్టేందుకు ఊబర్ క్యాబ్ సర్వీసెస్ అడ్వాన్స్ టిప్ పద్దతిని ప్రవేశపెట్టింది. టిప్ చెల్లిస్తే తొందరగా క్యాబ్ డ్రైవర్లు వస్తారని చెప్పింది. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పటికే అధిక రేట్లతో క్యాబ్ సర్వీసులు వినియోగదారులను విపరీతంగా దోచుకుంటున్నాయి. దానికి తోడు ఇప్పుడు ఇదొక కొత్త మోసమా అంటూ మండిపడుతున్నారు. టిప్ ఇస్తేనే వేగంగా వస్తారంటే...అందరూ అలాగే టిప్స్ అడుగుతారని...అప్పుడు ఇంక మామూలుగా ఎవరూ రారని మివర్శిస్తున్నారు. 

ఇంత అన్యాయమా..

తాజాగా ఈ అడ్వాన్స్ టిప్ మోడల్ పై కేంద్ర ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది, ఈ పద్ధతి చాలా ఆందోళనకరమైనదని వ్యాఖ్యానించింది. వేగవంతమైన సేవ కోసం వినియోగదారులను ముందస్తుగా టిప్ చెల్లించమని బలవంతం చేయడం  అనైతికమైనదని..  దోపిడీకి దారి తీస్తుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్ చేశారు. ఇలాంటి పద్ధతులు అన్యాయమైన వాణిజ్య కిందకు వస్తాయని చెప్పారు. వినియోగదారులు సేవలను మెచ్చి టిప్ ఇస్తే అదే వేరే కానీ ఇలా బలవంతంగా టిప్ ను వసూలు చేయడం కరెక్ట్ కాదని మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో సీసీపీఏ కూడా ఊబర్ అడ్వాన్స్ టిప్ పై రియాక్ట్ అయింది. ఊబర్ యాజమాన్యానికి  నోటీసులు జారీ చేసింది. అడ్వాన్స్ టిప్ పై వివరణ కోరింది. ఇంతకు ముందు డిఫరెన్షియల్ ప్రైసింగ్ వివాదం పై కూడా ఉబర్ కు నోటీసులు జారీ అయ్యాయి. జనవరి 23, 2025న, ప్రహ్లాద్ జోషి ఊబర్, ఓలా యాప్‌లు ఐఫోన్,  ఆండ్రాయిడ్ డివైస్‌లలో ఒకే రైడ్‌కు భిన్నమైన ధరలు వసూలు చేస్తున్నాయని ఆరోపణలపై CCPA ద్వారా నోటీసులు జారీ చేయించారు.  

ఈ ఊబర్ అడ్వాన్స్ టిప్స్ పై డ్రైవర్లు కూడా కంప్లైంట్ చేస్తున్నారు. టిప్స్ వచ్చినా అవి తమకు చేరడం లేదని...ఊబర్ యాజమాన్యమే మొత్తం తీసేసుకుంటోందని చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రూఫ్ లను కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇక ఊబర్ అడ్వాన్ టిప్ ఫీచర్ గురించి ఫిర్యాదు చేయాలనుకుంటే, వినియోగదారులు ఊబర్ యాప్‌లోని "హెల్ప్" సెక్షన్ ద్వారా లేదా help.uber.com వద్ద ఫిర్యాదు నమోదు చేయవచ్చు. అలాగే, CCPA హెల్ప్‌లైన్ (1915) లేదా jagograhakjago.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. 

 

 today-latest-news-in-telugu | cab 

Also Read: IND-USA: జూలై 8లోగా అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు