Youtuber Jyothi Malhotra Case: జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధం లేదంటున్న పోలీసులు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు పోలీసులు. ఆమెకు అన్నే తెలిసే పాకిస్థానీ ఇంటెలిజెన్స్‌ అధికారులతో మాత్రం సంప్రదింపులు కొనసాగించిందని అంటున్నారు.

New Update
Jyothi Malhotra Spent Pakistan Money on Foreign tours, luxury hotels

Jyothi Malhotra Spent Pakistan Money on Foreign tours, luxury hotels

Youtuber Jyothi Malhotra Case: పాకిస్తాన్ తో గూఢచర్యం(Espionage with Pakistan) చేసిందనే ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి మరిన్ని వివరాలను బయటపెట్టారు హరియాణా పోలీసులు. ఆమెకు ఉగ్రవాదులతో సంబంధాలు లేవని తేల్చారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు.  ఆమె పూర్తి స్పృహతోనే పాకిస్థానీ ఇంటెలిజెన్స్‌ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందని తెలిపారు. అంతేకాదు జ్యోతికి సాయుధ దళాల గురించి కూడా అవగాహన లేదని చెప్పారు. 

Also Read: IND-USA: జూలై 8లోగా అమెరికా, భారత్ వాణిజ్య ఒప్పందం

ఉగ్రవాదులతో సంబంధాల్లేవు..

ఉగ్ర ముఠాలతో గానీ, ఉగ్రవాదులతో గానీ జ్యోతికి సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలను మేం గుర్తించలేదు. ఉగ్ర కార్యకలాపాల్లోనే ఆమె పాలుపంచుకున్నట్లు సాక్ష్యాల్లేవని హిస్సార్ ఎస్పీ తెలియజేశారు. అయితే తనకు పరిచయమైన వారు పాక్ గూఢచర్య సంస్థకు చెందిన వారు అని తెలిసినా కూడా జ్యోతి స్నేహం కొనసాగించిందని...వారితో మాట్లాడుతూనే ఉందని చెప్పారు. అలాగే పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను ఆమె పెళ్ళి చేసుకోవాలని గానీ, మతం మార్చుకోవాలని కానీ అనుకోలేదని పోలీసులు చెబుతున్నారు. వీటికి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పారు. 

Also Read: Cinema: వరుసపెట్టి బయోపిక్ లలో ధనుష్..అబ్దుల్ కలాంగా కొత్త సినిమా

అంతకు ముందు పాక్ ISI ఏజెంట్ అలీ హసన్‌తో ఆమె లవ్‌లో ఉన్నట్లు తెలిసింది. 'నన్ను పాక్‌లో పెళ్లి చేసుకో' అంటూ అతనికి ప్రపోజ్  చేసిన సీక్రెట్ చాట్ బయటపడింది. అలీతో ఆమె ఎమోషనల్‌ రిలేషన్ కలిగివుందని, ఇదే క్రమంలో భారత సైన్యానికి సంబంధించిన సమాచారం కూడా షేర్‌ చేసిందని పోలీసులు గుర్తించారు. అయితే కొన్ని సంభాషణలు గూఢచారి కార్యకలాపాలకు సంబంధించిన కోడ్ రూపంలో ఉన్నాయని నిర్ధారించారు. అలాగే జ్యోతి బ్యాంక్ లావాదేవీలను పరిశీలించగా.. నాలుగు బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఒక అకౌంట్‌కు దుబాయ్ నుంచి డబ్బులు వచ్చాయని, ప్రస్తుతం వాటిని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కానీ ఇప్పుడు పోలీసులు మాత్రం పెళ్ళికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు. 

Also Read: పహల్గాం ఉగ్రదాడికి ముందు.. ఢిల్లీలో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్‌

today-latest-news-in-telugu | JYOTHI MALHOTRA | terrorists | youtuber 

Also Read: USA: గెట్ అవుట్...అసలెవరు నీకు జర్నలిస్ట్ ఉద్యోగం ఇచ్చారు..రిపోర్టర్ పై ట్రంప్ ఆగ్రహం

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు