US Flight Accident: అమెరికాలోని శాండియాగోలో కూలిన మరో విమానం

అమెరికాలో మరో విమాన ప్రమాదం జరిగింది. సెసనా సిటేషన్ 2 అనే అనే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ శాండియాగోలో ఇళ్ళపై కూలిపోయింది. ఈ ఘటనలో 15 ఇళ్ళు, వాహనాలతో పాటూ పలువురు చనిపోయారని తెలుస్తోంది. 

New Update
us

Flight Accident In US

అమెరికాలో విమాన ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చాలానే ఫ్లైట్ యాక్సిడెంట్లు జరిగాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు యూఎస్ లో 40కు పైగా విమాన ప్రమాదాలు జరిగాయి. వీటిల్లో దాదాపు 160 మంది చనిపోయారు. ఒక్క వాషింగ్టన్ లో జరిగిన ప్రమాదంలోనే దాదాపు 80 మంది దాకా చనిపోయారు. తరువాత జరిగనవన్నీ చిన్న చిన్న ప్రమాదల అయినప్పటికీ ఇద్దరు, లేదా ముగ్గురు చనిపోతూనే ఉన్నారు. ఎప్పుడూ లేనిది అసలు ఇంతగా అమెరికాలో విమాన ప్రమాదాలు ఇందుకు జరుగుతున్నాయో ఎవరికీ అంతు బట్టని విషయంగా మారింది. 

శాండియాగోలో కూలిన విమానం..

తాజాగా ఈరోజు ఉదయాన్నే మరో చిన్న విమానం కాలిఫోర్నియాలోని శాండియాగోలో కూలిపోయింది. అక్కడ ఇళ్ళు, వాహాల మీద ఫ్లైట్ పడిపోయింది. దీంట్లో 15 ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. సలువురు చనిపోయారు, మరికొంత మందికి గాయాలయ్యాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.  సెసనా సిటేషన్ 2 అనే చిన్న ఎయిర్ క్రాఫ్ట్ మాంటెగోమరీ నుంచి కాన్సస్ లోని విచితా అనే ప్రదేశానికి వెళుతోంది. 

 today-latest-news-in-telugu | usa | flight | accident | california

Advertisment
తాజా కథనాలు