Malakpet Gun Firing: మలక్‌పేటలో కాల్పులు కలకలం.. ఒకరు స్పాట్ డెడ్!
HYDలోని మలక్‌పేటలో కాల్పులు కలకలం సృష్టించాయి. నిన్న జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు, మరొకరు గాయపడినట్లు సమాచారం.
HYDలోని మలక్‌పేటలో కాల్పులు కలకలం సృష్టించాయి. నిన్న జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు, మరొకరు గాయపడినట్లు సమాచారం.
హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మలక్‌పేటలోని శాలివాహననగర్ పార్క్‌లో వాకర్స్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. వాకింగ్ చేస్తున్న చందు నాయక్ అనే వ్యక్తిపై తుపాకీతో ఫైరింగ్ చేశారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ యువనాయకుడు మారెల్లి అనిల్(35) అనుమానాస్పద మృతిచెందాడు. అతని కుడి భుజం నుంచి 2 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో బుల్లెట్లు లభ్యమైనట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వల్ల మూడు రోజులు తేలికపాటి నుంచి భారీ వడగళ్ల వాన కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
అమెజాన్‌లో కొన్న వస్తువును తిరిగి అప్పగించేందుకు యత్నించిన ఓ వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. ఆమె నుంచి వాళ్లు ఏకంగా రూ.1.07 లక్షలు కాజేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా చూసుకోవాలని ఎమ్మెల్యే సామేలుకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కష్టసుఖాలల్లో కలుపుకుపోవాలన్నారు. కార్యకర్తలను కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత నీపై ఉందని క్లాస్ తీసుకున్నారు.
వరంగల్ మెడికవర్‌లో డాక్టర్‌గా వర్క్ చేస్తున్న సృజన్ ఓ ఇన్ఫ్లూయెన్సర్ మోజులో పడి, భార్య ప్రత్యూషకు విడాకులు ఇస్తానని బెదిరించారు. ఆ యువతి మోజులో పడి తనని, పిల్లలను పట్టించుకోవడం లేదని మనస్తాపం చెంది డాక్టర్ ప్రత్యూష్ పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
తమ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచే నాటికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ ప్రకటించారు. తుంగతుర్తిలో ఈ రోజు జరుగుతున్న రేషన్ కార్డుల పంపిణీ సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో గుండెపోటుతో విద్యార్ధి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. కరుణాపురం గ్రామంలో జ్యోతిబాఫూలే బాలుర గురుకులంలో ఇంటర్ చదువుతున్న మణిదీప్(17) గుండెపోటుతో మృతి చెందాడు. ఇతని మృతిపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.