/rtv/media/media_files/2025/10/29/chamundeshwaranath-2025-10-29-22-06-51.jpg)
ప్రముఖ క్రికెట్ కోచ్ చాముండేశ్వరనాథ్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల ఆయన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో ICA ప్రతినిధిగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి.. ఓ బ్యాట్ బహుకరించారు. ఆ బ్యాట్‌పై ప్రముఖ స్టార్ క్రికెటర్ల అటోగ్రాఫ్‌లు ఉన్నాయి. అదే ఆ బ్యాట్ స్పెషలిటీ.
చాముండేశ్వరనాథ్ క్రీడా రంగంలో కీలక పదవిలో ఉండటం తెలుగు జాతికే గర్వకారణమని సీఎం రేవంత్ అన్నారు. ట్యాలెంట్ ఉన్న క్రీడాకారులను ఎంకరేజ్ చేయడంలో చాముండేశ్వరనాథ్ ముందు ఉంటారని సీఎం కొనియాడారు. దేశంలోని ప్రతీ క్రీడాకారుడిని భుజం తట్టి ధైర్యం చెప్పడంలో చాముండి తర్వాతే ఎవరైనా అంటూ.. రేవంత్ అభినందించారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లో ICA ప్రతినిధిగా ఎన్నికైన చాముండేశ్వరనాథ్.. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన బ్యాటును సీఎం రేవంత్‌కు చాముండేశ్వరనాథ్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల, వివేక్, ఎమ్మెల్సీ అజారుద్దీన్ పాల్గొన్నారు.
Follow Us