Azharuddin: తెలంగాణ కెబినెట్‌లోకి కొత్త మంత్రి

రాష్ట్ర మంత్రివర్గంలోకి అజారుద్దీన్‌ను తీసుకుంటున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఈమేరకు ఆయన అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ప్రభుత్వం సూచించింది.

New Update
Azharuddin

మాజీ టీం ఇండియా ఆటగాడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజారుద్దీన్‌(mohammad-azharuddin)ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్ణానం ప్రకటించింది. ఈమేరకు ఆయన అక్టోబర్ 31న ఉదయం 11 గంటలకు మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ప్రభుత్వం సూచించింది. దీంతో ఎమ్మెల్సీ చేసి ఆయన్ని హైదరాబాద్ నుంచి మంత్రి(New Minsters In Telangana cabinet)గా చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత, అజారుద్దీన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అజారుద్దీన్ గతంలో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు 2019లో ఆయన HCA అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1986లో అర్జున అవార్డు, 1988లో పద్మశ్రీ అందుకున్నారు.

తెలంగాణలో అన్నీ జిల్లాల్లో నుంచి మంత్రిలు ఉన్నారు. ఒక్క హైదరాబాద్ నుంచి ఇప్పటి వరకు మంత్రిగా ప్రతినిథ్యం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌పై ఓటమిపాలైయ్యారు. ఆయన అకాల మరణంతో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు జరుగుతున్నాయి.

Also Read :  ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు సాయం.. తుఫాన్ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ శుభవార్త!

ఇండియా టీంమిండియా కెప్టెన్‌గా అజారుద్దీన్ 

1984 డిసెంబర్ 31న కోల్‌కతాలో ఇంగ్లాండ్‌పై జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించారు  అజారుద్దీన్ తన తొలి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో వరుసగా సెంచరీలు (110, 105, 122) సాధించి ప్రపంచ రికార్డు సృష్టించారు.

కెప్టెన్సీ: 1989లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, 1990లలో చాలా కాలం జట్టును నడిపించారు. అత్యధిక వన్డే మ్యాచ్‌లకు (174) కెప్టెన్సీ వహించిన భారత కెప్టెన్లలో ఒకరు (సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టేవరకు). మూడు ప్రపంచ కప్‌లలో (1992, 1996, 1999) కెప్టెన్‌గా వ్యవహరించారు.

టెస్టులు: 99 మ్యాచ్‌లు ఆడి 6,215 పరుగులు (22 సెంచరీలు) చేశాడు.

వన్డేలు (ODI):334 మ్యాచ్‌లు ఆడి 9,378 పరుగులు (7 సెంచరీలు) తీశాడు.

అవార్డులు:వివాదం: 2000 సంవత్సరంలో, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని BCCI ద్వారా జీవితకాల నిషేధానికి గురయ్యారు. అయితే, 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నిషేధాన్ని చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఎత్తివేసింది.

Also Read :  ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి..ఐఎండీ తాజా హెచ్చరిక

Advertisment
తాజా కథనాలు