BIG BREAKING: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి!

జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ అయిన హైకమాండ్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Komatireddy Rajagopal reddy

జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికే డిసైడ్ అయిన హైకమాండ్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఎన్నికలకు ముందు ఆయనకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా కొన్ని రోజులుగా ఆయన వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని చల్లార్చినట్లు అవుతుందని పార్టీ పెద్దలు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మాజీ ఎంపీ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దీంతో ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం మైనార్టీలు ఎవరూ లేరు. దీంతో మైనార్టీ వర్గాల నుంచి ఒకరికి మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎవరిని తీసుకోవాలి? అన్న అంశంపై ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఇంత వరకు ఆ అంశం పెండింగ్ లో ఉంటూ వచ్చింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ తదితరులు కేబినెట్లో చోటు కోసం పోటీ పడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో గతంలో అక్కడ పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైన అజారుద్దీన్ వైపు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

జూబ్లీహిల్స్ లో లక్షకు పైగా ముస్లింల ఓట్లు ఉన్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.  తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం మూడు ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఒకటి అజారుద్దీన్, మరొకటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భర్తీ చేస్తే మరో ఖాళీ మిగులుతుంది. ఆ ఖాళీని బీసీతో భర్తీ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై రేపటిలోగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. 

#telangana cabinet expansion 2025 #mla komatireddy rajagopal reddy #latest-telugu-news #telugu-news
Advertisment
తాజా కథనాలు