MLA కాకుండా ముఖ్యమంత్రి.. మంత్రి అయిన లీడర్లు వీరే!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అజారుద్దీన్ చోటు దక్కింది. అక్టోబర్ 31న ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కానీ ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా లేరు. అయినా ఆయన కూడా మంత్రి పదవి ఇవ్వచ్చు.

New Update
Minister other than MLA

మాజీ టీమిండియా క్రికెటర్ అజారుద్దీన్ గ్రీస్‌లో లేకుండానే సిక్స్ కొట్టారు. ప్రస్తుతం ఆయనకు కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు అనే సామెత కరెక్ట్‌గా సెట్ అవుతోంది. మీరు ఎప్పుడైనా టీవీలో డైరీ మిల్స్ యాడ్ చూశారా? అందులో సమయానికి ఏం చేయకపోయినా మంచిదే అని ఓ ముసలావిడ కుర్రాడితో చెప్పారు. అలాగే ఉంది అజారుద్దీన్ అదృష్టం.. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఆయనకు బాగా కలిసొచ్చింది. పోటీ చేయకుండా సీటు త్యాగం చేసి మంత్రి అయ్యారు. 

తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అజారుద్దీన్ చోటు దక్కింది. అక్టోబర్ 31న ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కానీ అజారుద్దీన్ ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా లేరు. అయినా సరే ఆయన మంత్రి పదవి చేపట్టవచ్చు. కెబినెట్‌లోకి తీసుకున్నాక.. ఆరు నెలల్లోగా ఆయన శాసన మండలి లేదా శాసన సభ ఏదో ఒక చట్టసభలో సభ్యుడిగా ఉండాలి. దీంతో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అన్నీ జిల్లాలకు ప్రతినిధ్యం వహిస్తూ మంత్రులు ఉన్నారు ఒక్క హైదరాబాద్‌కు తప్ప. హైదరాబాద్ జిల్లా, మైనార్టీ విభాగాల వారీగా చూస్తే మంత్రి పదవికి అర్హుడు ఆయనొక్కడే ఉన్నారు. అలా ఆయన MLAగా గెలవకున్నా మంత్రి పదవి వరించింది. ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ప్రభుత్వం సూచించింది. 

ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ కాకుండానే మంత్రి పదవి చేపట్టిన నేతల జాబితాలో అజారుద్దీన్ చేరారు. ఇందులో ప్రధానంగా సీఎంగా పనిచేసిన అంజయ్యది రికార్డు. ఆయన అక్టోబర్ 11, 1980న ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లేకుండానే ఉమ్మడి ఏపీ సీఎంగా నియమించారు. రాజ్యాంగ నిబంధనలను నెరవేర్చడానికి ఆయన తరువాత శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా ఎమ్మెల్యే కాకపోయినా వైఎస్ క్యాబినెట్ లో యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏపీలో నారా లోకేష్ ఏప్రిల్ 2017లో తన తండ్రి ఎన్. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఆ తర్వాత మార్చి 2017లో MLCగా ఎన్నికయ్యారు. ఇప్పుడు అజారుద్దీన్ కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకుండానే రేవంత్ క్యాబినెట్ లో మంత్రి అవుతున్నారు. వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ కూడా MLAగా గెలవకుండానే ముఖ్యమంత్రి అయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో, ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, మండలి ద్వారా పలువురికి మంత్రి పదవులు ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు